ETV Bharat / sitara

'సుశాంత్​-సారా థాయ్​లాండ్ ట్రిప్​ నిజమే' - సుశాంత్ సారా బ్యాంకాక్​ ట్రిప్​.

బాలీవుడ్​ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్, హీరోయిన్​ సారా అలీఖాన్​తో కలిసి​ గతంలో థాయ్​లాండ్​ ట్రిప్​కు వెళ్లాడని చెప్పాడు సుశాంత్ మాజీ అసిస్టెంట్​ సాబిర్​ అహ్మద్​. అక్కడే ఓ విలాసవంతమైన హోటల్​లో వీరిద్దరు బసచేసినట్లు తెలిపాడు. అయితే తాను పని చేసినపుడు రాజ్​పుత్ డ్రగ్స్ తీసుకోలేదన్నాడు.

Sara Ali Khan
సుశాంత్
author img

By

Published : Aug 29, 2020, 1:18 PM IST

బాలీవుడ్​ యువ హీరో సుశాంత్ సింగ్​ రాజ్​పుత్, హీరోయిన్​ సారా అలీఖాన్​ మధ్య ప్రేమాయణం ​నడిచినట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఈ నటుడి స్నేహితుడు శామ్యూల్​ మిరండా ఈ విషయాన్ని ఇటీవల చెప్పగా బీటౌన్​లో అలజడి రేగింది. తాజాగా ఈ విషయమై మాట్లాడాడు సుశాంత్ మాజీ అసిస్టెంట్​ సాబిర్​ అహ్మద్.

గతంలో వీరిద్దరితో కలిసి ఓ ప్రైవేట్​ జెట్​లో థాయ్​లాండ్​ ట్రిప్​కు వెళ్లానని చెప్పాడు సాబిర్. మొత్తంగా ఆరుగురం కలిసి వెళ్లినట్లు తెలిపాడు. కాగా సుశాంత్, సారా బ్యాంకాక్​లోని ఓ విలాసవంతమైన హోటల్​లో బసచేసినట్లు వెల్లడించాడు. సందర్శనలో భాగంగా మిగితా వారు అక్కడే వేరే ప్రాంతాలను చూడటానికి వెళ్తే.. వీరు మాత్రం హోటల్​లోనే గడిపినట్లు పేర్కొన్నాడు. ఈ ట్రిప్​ కోసం సుశాంత్​ రూ.70లక్షల రూపాయలు ఖర్చు చేశాడని చెప్పాడు.

సుశాంత్​ డిప్రెషన్​కు గురయ్యే అవకాశం లేదని చెప్పాడు సాబిర్. అతనెప్పుడు అందరితో సంతోషంగా గడిపేవాడని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఈ హీరో ఓ డ్రగ్​ స్మగ్లర్​ వద్ద మాదక ద్రవ్యాలు విక్రయించినట్లు వస్తోన్న వార్తలను ఖండించాడు. తాను రాజ్​పుత్ దగ్గర పని చేసినపుడు అతడు​ డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశాడు.

సుశాంత్​-సారా 'కేదార్​నాథ్​'​ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ వ్యవహారం గురించి నడిచిందని వార్తలు వచ్చాయి. కానీ, దీనిపై వారిద్దరిలో ఎవరూ స్పందించలేదు.

ఇదీ చూడండి 'అవును.. సుశాంత్​, సారా​ ప్రేమలో పడ్డారు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.