Mahesh babu movies: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు దుబాయ్‌లో ఫ్యామిలీతో ప్రస్తుతం వెకేషన్లో ఉన్నారు. అయినా సరే కొత్త సినిమాకు సంబంధించిన వర్క్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. డైరెక్టర్ త్రివిక్రమ్, తమన్, నిర్మాత నాగవంశీతో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్గా నటించనుంది.

మహేశ్ హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా.. చివరి దశ షూటింగ్లో ఉంది. ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్. బ్యాంక్ రుణాల ఎగవేత నేపథ్య కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. మైత్రీమూవీమేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇవీ చదవండి: