ETV Bharat / sitara

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' వాయిదా తప్పదా?

రామ్​చరణ్ -ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' విడుదల దాదాపు వాయిదా పడేట్లు కనిపిస్తోంది. ఈ విషయమై సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

RRR to miss the October release?
'ఆర్ఆర్ఆర్' మూవీ
author img

By

Published : Apr 28, 2021, 2:24 PM IST

కరోనా దెబ్బకు మరో భారీ బడ్జెట్ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్ర షూటింగ్​ చివరి దశలో ఉంది. ఈ సమయంలో కరోనా సెకండ్​ వేవ్​ ప్రభావం వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

దీంతో అనుకున్న సమయానికి షూటింగ్​ పూర్తి కాకపోవచ్చని, చెప్పిన తేదీకి థియేటర్లలోకి సినిమా రాకపోవచ్చని అనుకుంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే అక్టోబరు 13 నుంచి సంక్రాంతికి విడుదల తేదీ మారే అవకాశముంది.

కల్పిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్​చరణ్​ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. రాజమౌళి దర్శకుడు. డీవీవీ దానయ్య, రూ.450 కోట్లతో 'ఆర్ఆర్ఆర్'ను నిర్మిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.