ETV Bharat / sitara

ఎయిర్​పోర్ట్​లో దర్శకుడు రాజమౌళికి చేదు అనుభవం - ఎయిర్​పోర్ట్​లో రాజమౌళికి చేదు అనుభవం

ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఎయిర్​పోర్ట్​లో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు జక్కన్న.

Rajamouli
రాజమౌళి
author img

By

Published : Jul 2, 2021, 10:01 AM IST

Updated : Jul 2, 2021, 10:20 AM IST

ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఎయిర్​పోర్ట్​లో చేదు అనుభవం ఎదురైంది. లుఫ్తాన్సా విమానంలో దిల్లీకి చేరుకున్న జక్కన్నకు అక్కడి పరిస్థితులు నచ్చలేదట. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసిన రాజమౌళి.. దిల్లీ ఎయిర్​పోర్ట్​ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • And surprised to find so many stray dogs in the hangar outside the exit gate. Again not a great first impression of India for the foreigners. Please look into it. Thank you…

    — rajamouli ss (@ssrajamouli) July 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"డియర్ దిల్లీ ఎయిర్​పోర్ట్. లుఫ్తాన్సా విమానంలో రాత్రి ఒంటి గంటకి దిల్లీ ఎయిర్​పోర్టు చేరుకున్నా. ఆర్​టీ పీసీఆర్ టెస్టు కోసం అప్లికేషన్ నింపమని ఇచ్చారు. కొందరు ప్రయాణికులు కింద కూర్చుని దరఖాస్తు ఫారం నింపుతుంటే మరికొందరు గోడకు ఫారం పెట్టుకుని నింపుతున్నారు. ఇందుకోసం కనీసం టేబుల్స్ కూడా వేయలేదు. అలాగే ఎగ్జిట్ గేట్ బయట వీధి కుక్కలు చాలా ఉన్నాయి. ఇది విదేశీ ప్రయాణికులపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్యలపై దృష్టి సారించండి. ధన్యవాదాలు."

-రాజమౌళి, దర్శకుడు

ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, తారక్, ఆలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్​గణ్ శ్రియ​ వంటి భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్​గా కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఇటీవలే చిత్రీకరణను మొదలుపెట్టారు. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Last Updated : Jul 2, 2021, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.