ETV Bharat / sitara

దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్ - rajamouli family home quarantine

స్టార్​ డైరెక్టర్ రాజమౌళికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే ట్వీట్ చేశారు. జక్కన్న ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

దర్శకధీరుడు రాజమౌళికి కరోనా పాజిటివ్
దర్శకుడు రాజమౌళి
author img

By

Published : Jul 29, 2020, 9:41 PM IST

Updated : Jul 29, 2020, 9:59 PM IST

'బాహుబలి'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళితో పాటు ఆయన కుటుంబానికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. తన కుటుంబ సభ్యులకు కొన్నిరోజుల క్రితం జ్వరం వచ్చి తగ్గిపోయిందని, అనంతరం తాజాగా పరీక్ష చేయించుకోగా, వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయిందని చెప్పారు. ప్రస్తుతం అందరం బాగానే ఉన్నామని స్పష్టం చేశారు.

వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్​లో ఉండనున్నట్లు రాజమౌళి తెలిపారు. తమ శరీరంలో ఎటువంటి లక్షణాలు కనిపించట్లేదని పేర్కొన్నారు. యాంటీబాడీస్ పెరుగుదల కోసం ఎదురుచూస్తున్నానని తద్వారా ప్లాస్మా దానం చేయనున్నామని చెప్పారు.

ప్రస్తుతం ఈయన 'ఆర్ఆర్ఆర్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జూ.ఎన్టీఆర్, రామ్​చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రానుందీ చిత్రం.

Last Updated : Jul 29, 2020, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.