ETV Bharat / sitara

శ్రుతిహాసన్​ ఒంటిపై ఎన్ని టాటులు ఉన్నాయంటే? - sruthi hasan movies latest

లాక్​డౌన్​ కారణంగా ఇంటికే పరిమితమైన నటి శ్రుతిహాసన్​.. తాజాగా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్​ల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అవేంటో ఆమె మాటల్లోనే విందాం రండి.

Shruti Haasan
శ్రుతి హాసన్​
author img

By

Published : Jul 29, 2020, 10:36 AM IST

"చిన్నతనంలో దొంగతనం చేసి నాన్నకు దొరికిపోయా.. లెక్కలు నాతో ఎప్పుడూ స్నేహంగా లేవు.. నేను అత్యంత చెత్తగా చేసిన చిత్రమదే.. బ్యాట్‌మ్యాన్, అల్దాదీన్‌ చిత్రాల్ని ఇష్టపడతా" అంటూ బోలెడన్ని ఆసక్తికర కబుర్లను పంచుకుంది నటి శ్రుతి హాసన్‌.

కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కాసేపు అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత, సినీ కెరీర్‌ల గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

  • ఈ లాక్‌డౌన్‌తో నేర్చుకున్న విషయం ఏంటి?

సృష్టిలో ఏ విషయం మన నియంత్రణలో ఉండదు. మీలోని ఉత్తమ నైపుణ్యాల్ని గుర్తించండి. ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో మెలగండి.

  • అందం రహస్యం?

బాగా వర్కవుట్స్‌ చెయ్యడం. నీళ్లు బాగా తాగడం. ఒకరకంగా ఇది నా తల్లిదండ్రుల మంచి జీన్స్‌ నుంచి వచ్చింది.

  • మీ ఒంటిపై మొత్తం ఎన్ని టాటూలు ఉన్నాయి?

మొత్తం ఐదున్నాయి. మెడపై వేయించుకున్న మ్యూజిక్‌ సింబల్‌. వీపుపై వేయించుకున్న నా పేరు. చేతి మణికట్టుపైన గులాబీ పువ్వు. నడుము కింద ఓ డిజైన్‌. కాలి పాదంపైన మరొక పచ్చబొట్టు ఉన్నాయి.

  • మణికట్టుపైన ఉన్నది గులాబీ టాటూ అంటున్నారు. క్యాబేజీలా ఉంది కదా?

అవును నిజమే. అది గులాబీనే కానీ, క్యాబేజీలా కనిపిస్తోంది. అందుకే నేనూ ఇకపై ఇది క్యాబేజీ అనే ఫిక్సవుతున్నా. మీకూ చెబుతున్నా.. ఇది క్యాబేజీ (నవ్వుతూ).

  • ప్రేమ విషయంలో సంథింగ్‌ సంథింగ్‌ అని తెలుస్తోంది?

అలాంటిదేం లేదు. నథింగ్‌.. నథింగ్‌ (నవ్వుతూ).

  • బాగా ఫిట్‌నెస్‌ ఉండే వ్యక్తిని ప్రేమించడానికి ఇష్టపడతారా?

మామూలు ఫిట్‌నెస్‌ ఉన్న వ్యక్తి అయినా పర్లేదు. చక్కటి ఆరోగ్యవంతుడైతే చాలు.

  • ఇప్పటికిప్పుడు మీకు సూపర్‌ పవర్స్‌ వస్తే ఏం చేస్తారు?

ప్రమాదకరమైన ఇలాంటి వైరస్‌లన్నింటినీ అంతమొందిస్తా. అందరికీ సాయం చేస్తా. ప్రతి ఒక్కరినీ వాళ్ల ఇళ్లకు చేరుస్తా.

  • చిన్నప్పుడు చేసిన సరదా దొంగతనం?

చాలా చిన్న వయసులో ఓ క్యాండీస్‌ ప్యాకెట్‌ కొట్టేశా. కానీ, నేను చేసిన పని నాన్న కనిపెట్టేశారు. ఆ షాప్‌ యజమానికి క్యాండీస్‌ ప్యాకెట్‌ తిరిగిచ్చేసి.. క్షమించమని కోరారు. నా పనికి చాలా సిగ్గుపడ్డా. మళ్లీ ఎప్పుడూ అలాంటి పని చెయ్యకూడదని నిర్ణయించుకున్నా.

  • లెక్కల్ని ద్వేషిస్తారా?

లేదు నిజానికి లెక్కలే నన్ను ద్వేషిస్తాయి. మా టీచర్‌ ఎప్పుడూ చెబుతుండేది అంకెల్ని మీ స్నేహితుల్లా భావించమని. కానీ, అవెప్పుడూ నాతో అలా స్నేహంగా లేవు (నవ్వుతూ)..

  • అత్యంత చెత్తగా నటించాను అనుకున్న చిత్రం?

హిందీ చిత్రం 'లక్‌'

  • దుస్తులు ఎక్కువగా ఎక్కడ కొంటారు?

ఈ మధ్య ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే కొంటున్నా. బయటకెళ్తే ముంబయి, చెన్నై చాలా చోట్ల కొంటా. లండన్‌లో షాపింగ్‌ చెయ్యడాన్ని ఎంతో ఇష్టపడతా. వర్షం పడుతున్న సమయంలో లండన్‌ వాతావరణం నాకు చాలా నచ్చుతుంది.

  • బాగా చెయ్యగలిగే వంట?

నేను సాంబార్‌ చాలా బాగా చేస్తా. నాకిది కాస్త గర్వంగా అనిపించే విషయం.

  • మళ్లీ ఓ సినిమాకి సంగీతమెప్పుడు అందిస్తారు?

ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేను. కానీ, సంగీతం అందించడాన్ని నేనెప్పుడూ చాలా ఆస్వాదిస్తుంటా. స్క్రిప్ట్‌ నచ్చి నాకు నేను పాటలు రాసుకున్నప్పుడు ఆ పనిని మరింత ఎంజాయ్‌ చెయ్యగలుగుతా.

  • 'క్రాక్‌' సినిమా విశేషాలేంటి?

నిజానికి మే 8న విడుదల కావాల్సి ఉంది. ఈలోపు కరోనా పరిస్థితులు అడ్డు తగిలాయి. కొద్దిగ చిత్రీకరణ మిగిలి ఉంది. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే ఆ పనులు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. నేను ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.

  • ఆఖరిగా ఈ క్వారంటైన్‌ ఒత్తిడిని నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి?

మీ కుటుంబ సభ్యులతో చక్కగా గడపండి. మీ స్నేహితులతో సరదాగా మాట్లాడండి. అప్పటికీ మీకు ఉపశమనం దక్కకుంటే.. మానసిక వైద్యులకు ఫోన్‌ చేసి మీ పరిస్థితిని వివరించి కౌన్సిలింగ్‌ తీసుకోండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.