ETV Bharat / sitara

Cinema News: షారుక్​తో సంజయ్​దత్ మూడోసారి! - షారుక్​ఖాన్ లేటెస్ట్ న్యూస్

సీనియర్ నటుడు సంజయ్​దత్.. షారుక్​తో కలిసి మూడోసారి నటించేందుకు సిద్ధమవుతున్నారు! ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా.. త్వరలో సెట్స్​పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

SRK, Sanjay Dutt to reunite for multilingual film?
షారుక్ సంజయ్​దత్ మూవీ
author img

By

Published : Jul 14, 2021, 9:30 PM IST

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ఖాన్​.. 'పఠాన్' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. కొన్నేళ్లుగా కొత్త ప్రాజెక్టులను ప్రకటించిన షారుక్.. ఇకపై వరుసగా చిత్రాలు చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే పఠాన్ తర్వాత రాజ్​ కుమార్ హిరానీ, తమిళ డైరెక్టర్​ అట్లీతో కలిసి పనిచేయనున్నారు. దీని తర్వాత కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చారు.

ఇందులో సీనియర్ సంజయ్​దత్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈయన షారుక్​ 'ఓం శాంతి ఓం', 'రావన్' సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో అలరించేందుకు రెడీ అవుతున్నారట. 'రాఖీ' పేరుతో తెరకెక్కే ఈ సినిమాను వయకామ్ 18 స్టూడియోస్​ నిర్మించనుంది!

'భుజ్:ద ప్రైడ్ ఆఫ్ ఇండియా' సినిమాతో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్న సంజయ్ దత్.. సంషేరా, కేజీఎఫ్ 2 చిత్రాల్లో నటించారు. అవి విడుదల కావాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.