ఇంట్లో ఒంటరిగా తల్లీకూతుర్లు.. ఆ సమయంలో పులి వస్తే వాళ్లిద్దరూ ఏం చేశారు. జంతువు నుంచి పాపను కాపాడేందుకు తల్లి ఎలాంటి ప్రయత్నాలు చేసింది?. ఇదే కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'గర్జన'. ప్రముఖ నటీనటులు శ్రీరామ్, రాయ్‌లక్ష్మీ జంటగా నటించారు. ఈరోజు సినిమా తెలుగు టీజర్ విడుదలైంది. ఇందులో అమ్మాయి అరుపుతో మొదలైన వీడియో... ఆద్యంతం ఆసక్తితో రూపొందించారు. పెద్దపులిని గ్రాఫిక్స్‌లో అద్భుతంగా చూపించారు. మనిషి, మృగం.. ఇద్దరిలో ఎవరు ప్రమాదకరం అనేది కథాంశం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పొలాచ్చి, తలకొన, మున్నార్, చెన్నై, ఊటీ, కొడైకెనాల్ తదితర లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. త్వరలోనే ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.
జె.పార్తిబన్ దర్శకుడు. జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై.. బి. వినోద్ జైన్ సమర్పణలో ఎం. నరేష్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. కథ, స్క్రీన్ప్ ప్లే, సినిమాట్రోగ్రఫీ ఎంవీ పన్నీర్ సెల్వమ్ నిర్వర్తించారు. ఇందులో దేవ్ గిల్, నైరా, వైష్ణవి చంద్రన్ మీనన్, ద్వైత, బ్లాక్ పాండి తదితరులు నటించారు.
ఈ మధ్య కాలంలో హాట్‌హాట్ ఫొటోలతో సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్ అయిన రాయ్‌లక్ష్మీ.. ఈ సినిమాలో కాస్త పద్దతిగానే కనిపించింది. తెలుగులో గతేడాది 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం కన్నడలో 'జాన్సీ', తమిళంలో 'సిండ్రెల్లా', 'మిరుగా' చిత్రాలతో బిజీగా ఉందీ అందాల భామ.
