ETV Bharat / sitara

ఆ పొరపాట్ల వల్లే నా కెరీర్​ ఇలా: డైరెక్టర్ శ్రీనువైట్ల

గత కొన్నేళ్లుగా పరాజయాల్ని ఎదుర్కొంటున్న ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల.. కెరీర్​ గురించి, చేయబోతున్న ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. మళ్లీ కచ్చితంగా అందరి ప్రేమ పొందుతానని తన నమ్మకం అని అన్నారు.

srinu vaitla special interview
శ్రీనువైట్ల
author img

By

Published : Jun 13, 2021, 7:25 AM IST

"నా కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఎక్కువే. అయినా సరే పరిశ్రమ, ప్రేక్షకులు నాపైన నమ్మకం కోల్పోలేదు. పరాజయాల వెనక నా ప్రయత్నలోపం కనిపిస్తుందే తప్ప.. ప్రేక్షకులు మాత్రం మంచి సినిమా తీసినప్పుడంతా ఆదరించారు. మంచి కలయికల్లో సినిమాలు తీశా. మళ్లీ కచ్చితంగా అందరి ప్రేమ పొందుతానని నా నమ్మకం"

మాస్‌ సినిమాకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు శ్రీనువైట్ల. హీరోయిజానికి.. యాక్షన్‌ అంశాలకీ తనదైన శైలి హాస్యాన్ని మేళవిస్తూ ప్రేక్షకుల్ని నవ్వించారు. వరుస విజయాల్ని అందుకున్నారు. ఈమధ్య వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయన ఇప్పుడు డబుల్‌ డోస్‌ వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నారు. మంచు విష్ణుతో ‘డి అండ్‌ డి’ తెరకెక్కించేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనువైట్లతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ..

లాక్‌డౌన్‌లో కథలపైనే దృష్టిపెట్టారా?

రచయితలతో జూమ్‌లో మాట్లాడుకోవడం, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసుకోవడం, వ్యాయామం చేయడం. దాదాపుగా ఇలాగే గడిచింది లాక్‌డౌన్‌. ఈ విరామంలో జరిగిన మంచి విషయం ఏమిటంటే... మూడు కథలు పక్కాగా సిద్ధం కావడం. ‘డి అండ్‌ డి’ చిత్రీకరణ త్వరలోనే మొదలు పెడతాం. ఆ తర్వాత వెంట వెంటనే మిగిలిన సినిమాలు చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వాటిని కూడా త్వరలోనే ప్రకటిస్తాం.

‘ఢీ’ సినిమాకి ‘డి అండ్‌ డి’ కథకూ ఎలాంటి సంబంధం ఉంటుంది?

దానికి పూర్తి భిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నాం. ‘ఢీ’కి కొనసాగింపు ఎంతమాత్రం కాదు. కానీ ఎక్కడో ఆ సినిమాతో సహజమైన ఓ చిన్న కనెక్షన్‌ మాత్రం ఉంటుంది. చూస్తున్నప్పుడు కచ్చితంగా ‘ఢీ’ చూసిన క్షణాలు, ఆ పాత్రలు లీలగా గుర్తుకొస్తాయి. ‘ఢీ’ సినిమా అనేది నాకో మంచి అనుభవం. ఆ సినిమాని గుర్తు చేసుకుంటూ, నవ్వుకుంటూ ‘డి అండ్‌ డి’ కథ తయారు చేసుకున్నాం.

వెబ్‌సిరీస్‌లు చూస్తున్నా అన్నారు కదా. ఆ తరహాలో ప్రయత్నం చేయాలనే ఆలోచనలు మీకేమైనా వచ్చాయా?

వెబ్‌సిరీస్‌లు చూస్తూ ట్రెండ్‌ని అర్థం చేసుకుంటుంటా. అంతే కానీ.. అలాంటి ప్రయత్నాలు చేయాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ రాలేదు. నా దృష్టిలో సినిమాతో పోలిస్తే వెబ్‌సిరీస్‌లు పూర్తిగా వేరు. వాటి కంటెంట్‌ వేరు. నా సినిమాల నుంచి ప్రేక్షకులు వంద శాతం కామెడీని ఊహిస్తారు. నా ఆలోచనలు ఎప్పుడూ వెండితెర లక్ష్యంగానే ఉంటాయి. అయితే వేదిక ఏదైనా... కంటెంట్‌ అత్యుత్తమంగా ఉండాల్సిందే, అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. ఓటీటీ వేదికలవల్ల ప్రేక్షకులు ప్రపంచ సినిమాకు చేరువ అవుతున్నారు. అది మంచి పరిణామమే.

ఇప్పుడు రియలిస్టిక్‌ సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. వీటిపైన మీ అభిప్రాయం?

నేను తీసిన ‘ఢీ’ మొదలుకొని చాలా సినిమాలు రియలిస్టిక్‌గానే ఉంటాయి. అదే సమయంలో వినోదాత్మకంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ప్రేక్షకులు కనెక్ట్‌ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నేనేం చేసినా, ఎలా కథ చెప్పినా అది వినోదాత్మకంగా ఉండాలనుకుంటారు ప్రేక్షకులు. ఇప్పుడదే చేస్తున్నాం.

ట్రెండ్‌ని సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే మీ కెరీర్‌లో ఒడుదుడుకులు అనుకోవచ్చా?

ఎవరైనా సరే, ముందస్తు ఆలోచనలతో ప్రయాణం చేయాల్సిందే. అప్పుడే ట్రెండ్‌కు దగ్గరగా ఉంటాం. నేను ట్రెండ్‌ మారిపోయిందనే అంచనాతో చేసిన పొరపాట్ల ఫలితమే నా కెరీర్‌లో ఒడుదుడుకులు అని భావిస్తా. నా సినిమాల నుంచి ఎక్కువ మోతాదులో వినోదం అందించాను కాబట్టి, నా నుంచి ప్రతిసారీ అంతే కామెడీని అంచనా వేస్తారు ప్రేక్షకులు. కానీ నేను నా టైమింగ్‌కు తగిన కథల్ని ఎంచుకోలేకపోయా. అందుకే కొన్ని పరాజయాలు పలకరించాయి. ఇక మళ్లీ ఆ పొరపాటు చేయదలచుకోలేదు. నా టైమింగ్‌కు తగ్గ కథల్ని ఎంచుకుంటూ... వాటిని ఇప్పుడు ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్స్‌ చేస్తూ సినిమాలు చేస్తా.

రీమేక్‌ సినిమాలతో తిరిగి ఫామ్‌ అందుకున్నవాళ్లు కూడా ఉన్నారు. మీరు మాత్రం ఎప్పుడూ రీమేక్‌ చేయలేదెందుకు?

నా కెరీర్‌లో ఎప్పుడూ రీమేక్‌ చేయలేదు. భవిష్యత్తులో ఆసక్తికరమైన స్క్రిప్ట్‌ అనిపిస్తే ఏదైనా చేస్తానేమో తెలియదు.

ఫలానా రకమైన సినిమా చేయాలనే ప్రత్యేకమైనా ప్రణాళికలేమైనా ఉన్నాయా?

ఎప్పుడైనా సరే, చేస్తున్న సినిమానే నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా భావిస్తుంటా. పెద్ద సినిమా, చిన్న సినిమా ఇవేవీ కాదు. ఏం చేసినా మంచి సినిమా, వినోదాత్మకంగా ఉండేలా చేయాలని ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.