శ్రీకాంత్, భూమిక ప్రధాన పాత్రల్లో సుమంత్ అశ్విన్, తాన్యా జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. లాక్డౌన్ కంటే ముందు లద్దాఖ్‌లో 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఇప్పుడు హైదరాబాద్‌లో మళ్లీ మొదలుపెట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పనిచేస్తున్నారు.
నాలుగు పాత్రల చుట్టూ ఉండే రోడ్డు ప్రయాణం ఆధారంగా దర్శకుడు గురుపవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చాలా రోజుల తర్వాత సెట్స్‌లోకి రావడం ఆనందంగా ఉందని చెప్పిన భూమిక... త్వరలోనే తెరపై కనిపిస్తామని అన్నారు. సాధ్యమైనంత త్వరగా థియేటర్లు తెరుచుకుని పరిస్థితి మెరుగుపడాలని శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.