ETV Bharat / sitara

బాలయ్య కథతో శ్రీకాంత్ హీరోగా సినిమా.. దర్శకుడు ఆయనే! - బాలయ్య

srikanth movies as hero: ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్​.. బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ'లో విలన్​గా మెప్పించారు. అయితే శ్రీకాంత్​ను మరి కొన్ని సినిమాల్లో హీరోగానే చేయాలని బాలయ్య సూచించారట. అందుకు అయనే ఓ కథ చెప్పి, దర్శకుడు ఎవరైతే బాగుంటుందో కూడా చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకాంత్ వెల్లడించారు.

srikanth meka
శ్రీకాంత్
author img

By

Published : Dec 14, 2021, 4:49 PM IST

Updated : Dec 14, 2021, 5:12 PM IST

srikanth movies as hero: హీరోగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. బాలకృష్ణ నటించిన 'అఖండ'లో విలన్​గా మెప్పించారు నటుడు శ్రీకాంత్. కెరీర్​ తొలినాళ్లలో విలన్​గా కొన్ని పాత్రలో చేసినా.. అనంతరం హీరోగా 100కు పైగా సినిమాల్లో నటించి కుటుంబ ప్రేక్షకుల విశేష ఆదరణ పొందారు. అయితే 'అఖండ'లో పవర్​ఫుల్​ విలన్ ​పాత్ర చేయడం వల్ల ఆ తరహా పాత్రలు శ్రీకాంత్​కు క్యూ కడతాయని బాలయ్య చెప్పారట. కానీ కొన్నాళ్లు హీరోగానే చేయాలని తనకు బాలకృష్ణ సూచించినట్లు శ్రీకాంత్ తెలిపారు.

srikanth meka
'అఖండ'లో విలన్​గా శ్రీకాంత్​

"'అఖండ' సెట్​లో ఉన్నప్పుడే బాలకృష్ణ గారు.. 'శ్రీకాంత్.. ఈ సినిమా తర్వాత నీకు విలన్​ క్యారెక్టర్స్​ భయకరంగా వస్తాయి. ఏది పడితే అది చేయొద్దు. హీరోగా కొన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్లు. నా దగ్గర ఓ మంచి కథ ఉంది' అని .. ఓ ఇంగ్లీష్ సినిమా పేరు చెప్పారు. అది చాలా పాత సినిమా. ఆ కథను కృష్ణవంశీతో తెరకెక్కించాలని సూచించారు. 'నువ్వు హీరోగా చేయాల్సిందే.. నేనిస్తాను కథ' అంటూ చెప్పారు బాలయ్య."

-శ్రీకాంత్, నటుడు

ఆర్టిస్ట్ బాగుండాలని కోరుకునే వ్యక్తి..

"ఒక ఆర్టిస్ట్​ను బాలయ్య చాలా గౌరవిస్తారు. వారు భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది, ఆర్టిస్టులు మొహమాట పడకూడదు.. లాంటి మంచి సూచనలు చేస్తుంటారు. ఏదైనా చాలా బాగా చెప్తారు" అని శ్రీకాంత్ తెలిపారు.

సెట్​లో బాలయ్య ఎలా ఉంటారంటే..?

ఇక సెట్​లో బాలయ్య ఫుల్​ ఎనర్జీతో ఉంటారని చెప్పారు నటి పూర్ణ. "బాలకృష్ణ.. పొద్దున నుంచి సాయంత్రం వరకు అదే ఎనర్జీతో ఉంటారు. ఒక్కరోజు కూడా అలసటతో కనిపించరు" అని వివరించారు. బాలయ్య.. సీన్​ అయ్యే వరకు సెట్​లో కూర్చోరని చెప్పారు శ్రీకాంత్. ఎండలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని వివరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: బాక్సాఫీస్​పై బాలయ్య సింహగర్జన.. 'అఖండ' @రూ.100కోట్లు!

Last Updated : Dec 14, 2021, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.