ETV Bharat / sitara

'ఆ విషయమే ఎక్కువ మాట్లాడతారు.. నాకేమో చిరాకు'

'శ్రీదేవి సోడా సెంటర్'తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైన హీరో సుధీర్​బాబు.. పలు ఆసక్తికర విషయాల్ని చెప్పారు. పాఠశాల స్థాయిలో హాస్టల్​లో ఉండటం వల్ల ఈ చిత్రం కోసం గోదావరి యాస పలకడం తేలికైందని అన్నారు.

hero sudheer babu interview
సుధీర్​బాబు
author img

By

Published : Aug 27, 2021, 6:34 AM IST

'ఎస్‌.ఎం.ఎస్‌', 'ప్రేమ కథా చిత్రమ్‌', 'భలే మంచి రోజు', 'సమ్మోహనం' తదితర చిత్రాలతో హీరోగా అలరించి, 'వి'తో విలన్‌గానూ మెప్పించిన నటుడు సుధీర్‌ బాబు. వాటన్నింటికీ భిన్నంగా ఆయన నటించిన తాజా చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్‌'. ఆనంది కథానాయిక. కరుణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 27న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న విషయాలివీ..

Sridevi soda centre movie
శ్రీదేవి సోడా సెంటర్ మూవీ

రిస్క్‌ చేసి కథ వినించారు..

దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన తొలి చిత్రం 'పలాస' చూసిన వెంటనే ఆయనకు ఫోన్‌ చేసి, చాలా బాగుందని చెప్పాను. అలా మాట్లాడుతూ నాకు సరిపోయే కథ ఏదైనా ఉంటే చెప్పండని అడిగాను. కొన్ని నెలల తర్వాత కథను నాకు వినిపించాలనుకున్నారు. అదే సమయంలో కొవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ మొదలైంది. దాంతో నేను ఆన్‌లైన్‌ వేదికగా ఆ స్క్రిప్టు వివరించమని అడిగా కానీ ఆయన అలా చేయలేదు. కొవిడ్‌ భయం ఉన్నా రిస్క్‌ తీసుకుని ప్రత్యక్షంగానే కథ చెప్పారు. బాగా నచ్చడం వల్ల అంగీకరించాను. కమర్షియల్‌ హంగులున్న మంచి కథ ఇది. ఈ చిత్రంలో డ్యాన్సులు, పోరాటాల్ని కావాలని రూపొందించలేదు. అవన్నీ కథలో భాగంగానే సాగుతాయి. ఈ సినిమా వాస్తవికతకు అద్దం పడుతుంది.

రెండు సినిమాలు వేర్వేరు

'పలాస'.. 1978లో జరిగిన కథ. 'శ్రీదేవి సోడా సెంటర్‌' ప్రస్తుతానికి సంబంధించింది. రెండింటికీ చాలా తేడా ఉంది. 1978లో పరిస్థితులు ఎలా ఉండేవో దాన్నే దర్శకుడు 'పలాస'లో చూపించారు. వాస్తవాల్ని తెరకెక్కించే ప్రయత్నంలో కుల ప్రస్తావన వచ్చింది. 'శ్రీదేవి'లో ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న వాటిని తెరపైకి తీసుకురావాలనుకున్నారు. అలా సాధారణంగా అందరి మధ్య సాగే సంభాషణలే వినిపించారు. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా కులాల గురించి చూపించట్లేదు. ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. మొదటి నుంచీ థియేటర్లలోనే విడుదల చేయాలనే నిర్ణయంతో వాటిని తిరస్కరించాం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇలా కనిపిస్తా..

నేనిందులో సూరిబాబు అనే ఎలక్ట్రిషియన్‌ పాత్ర పోషించాను. సూరిబాబుకు వాళ్ల అమ్మ అంటే ఎంతో ప్రేమ. అమ్మలాంటి అమ్మాయి తన జీవితంలోకి రావాలని కోరుకుంటాడు. పట్టణంలో సొంతంగా ఓ షాపు పెట్టి, జీవితంలో స్థిరపడాలనేది సూరిబాబు లక్ష్యం. దాని కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తను కోరుకున్న లక్షణాలున్న అమ్మాయి శ్రీదేవి పరిచయం అవుతుంది. వాళ్లు ప్రేమలో ఎలా పడ్డారు? తర్వాత ఏం జరిగింది? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది. ఇప్పటి వరకూ పోషించిన పాత్రలకు ఇది విభిన్నంగా ఉండాలనుకున్నాను. అందుకే సూరిబాబు పాత్రలో ఒదిగిపోయేందుకు ఓ ఎలక్ట్రిషియన్‌ చేసే పనిని దగ్గరుండి పరిశీలించా. నేను చిన్నప్పటి నుంచీ హాస్టల్‌లోనే పెరిగాను. దాంతో వివిధ ప్రాంతాల యాస తెలుసుకోగలిగాను. అలా ఈ సినిమాలో గోదావరి యాస పలకడం తేలికైంది. 90శాతం చిత్రీకరణ అమలాపురంలోనే సాగింది.

hero sudheer babu
హీరో సుధీర్​బాబు

హీరో పాత్రలే ఇష్టం..

నటన.. మనసుకు సంబంధించిందని అందరూ అనుకుంటారు. శరీరానికి సంబంధించిదనేది నా అభిప్రాయం. అందుకే నేను ఆయా పాత్రల నుంచి త్వరగా బయటకి వచ్చేస్తుంటా. ఒక్క సినిమాతో వచ్చే స్టార్‌డమ్‌ గురించి నాకు పెద్దగా ఆలోచన లేదు. సుధీర్‌ ఏ పాత్రైనా చేయగలడు.. అనుకునేలా కొనసాగాలనుంది. ఇప్పటి వరకూ నా మార్కెట్‌ దృష్టిలో పెట్టుకుని ఏ దర్శకుడూ నా దగ్గరికీ రాలేదు. మంచి కథతో, దానికి న్యాయం చేయగలననే నమ్మకంతో వచ్చారు. అందుకే నా కెరీర్‌లో పరాజయాలు తక్కువగా ఉన్నాయి. కృష్ణ, మహేశ్ బాబు సినిమాల్ని కేస్‌స్టడీలా తీసుకుంటాను. వాళ్లు చేసిందే నేను చేయాలని అనుకోను. కథల ఎంపికలో నా ప్రత్యేకత ఉండాలనుకుంటాను. ప్రతినాయకుడి పాత్రలూ పోషించినా నేను నాయక పాత్రనే ఇష్టపడతా. ప్రత్యేకంగా ఈ నటులే నాకు స్ఫూర్తి అని చెప్పలేను. సినిమాలే నన్ను ఇన్‌స్పైర్‌ చేశాయి.

Sridevi soda centre anandhi
హీరోయిన్ ఆనంది

అప్పుడే కలిసి నటించాల్సింది కానీ..

కరుణ కుమార్‌ లిటలేచర్‌ నేపథ్యం ఉన్న దర్శకుడు. అందుకే బలమైన కథల్ని రాస్తుంటారు. మనుషుల్ని పరిశీలించి, వాళ్ల భావోద్వేగాల్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సెట్‌లో అప్పటికప్పుడు సంభాషణలు రాయగలరు. ఆయనలో నటుడూ ఉన్నాడు. శ్రీదేవి పాత్రకు ఆనంది సరిగ్గా సరిపోయింది. తెలుగమ్మాయి కావడం వల్ల చాలా కంఫర్ట్‌గా నటించాం. ఆమెతో కలిసి 'ప్రేమ కథా చిత్రమ్‌'లోనే నటించాల్సింది. కానీ, అప్పుడు మిస్ అయింది. కళ్లు పెద్దగా ఉండటం వల్ల ఆ సినిమాలోని పాత్రకు బాగా సెట్‌ అవుతుందని నందితను ఎంపిక చేశాం. ఆనంది.. ప్రతిభగల నటి. శ్రీదేవిగా తప్పకుండా మీ అందరినీ మెప్పిస్తుంది.

తదుపరి ప్రాజెక్టులు..

ప్రస్తుతానికి బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వచ్చాయి. త్వరలోనే ఆ వివరాలు చెప్తా. ఇంతకు ముందే అనుకున్న పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు వీలు పడట్లేదు. అందుకే గోపీచంద్‌ను ప్లేయర్‌గా, కోచ్‌గా ఒకే సినిమాలో చూపించనున్నాం. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈలోగా ఇప్పటికే ఖరారు చేసిన 'ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', హర్షవర్ధన్‌ దర్శకత్వంలో మరో సినిమా పూర్తి చేయాల్సి ఉంది.

చాలామంది నా ఫిట్‌నెస్‌ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. నాకేమో చిరాకొస్తుంది. మరీ ఎక్కువగా నా ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడుతున్నారు.. సంవత్సరం వరకు నేను ఫిట్‌నెస్‌ ఫాలో అవను. పొట్ట పెంచుతున్నా అని ఒక రోజు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది (నవ్వుతూ..).

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.