ETV Bharat / sitara

'ఢీ' చిత్రానికి సీక్వెల్.. స్క్రిప్ట్​ పనుల్లో దర్శకుడు! - తెలుగు సినిమా వార్తలు

'ఢీ' సీక్వెల్ కోసం దర్శకుడు శ్రీను వైట్ల, హీరో విష్ణు.. మరోసారి కలిసి పనిచేయనున్నారట. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రసుత్తం జరుగుతోంది.​

Sreenu Vaitla readying a sequel to his blockbuster
'ఢీ' చిత్రానికి సీక్వెల్.. స్క్రిప్ట్​ పనుల్లో దర్శకుడు!
author img

By

Published : Mar 11, 2020, 11:04 AM IST

టాలీవుడ్​లో 'ఢీ' చిత్రానికి ఉన్న ప్రత్యేకత వేరు. కామెడీ ప్రధానంగా తీసిన ఈ చిత్రం.. 2007లో ప్రేక్షకుల ముందుకొచ్చి, బ్లాక్​బస్టర్​గా నిలిచింది. అప్పటి నుంచి దీనికి సీక్వెల్​ తీయాలని చాలాసార్లు అనుకున్నారు. కానీ కుదరలేదు. ఎట్టకేలకు అందుకు సంబంధించిన స్క్రిప్ట్​ వర్క్ ప్రస్తుతం జరుగుతుందని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరో విష్ణు.. సీక్వెల్​ గురించి స్పష్టం చేశాడు. దర్శకుడు శ్రీనువైట్ల.. రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్​ సిద్ధం చేస్తున్నారని అన్నాడు. ఈ ఏడాది ద్వితియార్థంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

గత కొన్నేళ్ల నుంచి శ్రీను వైట్ల, విష్ణులకు సరైన హిట్ లేదు. ఈ సీక్వెల్​తో ఎలాగైనా సరే మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అనుకుంటున్నారు. మరి వీరిని విజయం వరిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.