ETV Bharat / sitara

ఈ అందాల భామలు 'అల్లరి' గోపికమ్మలు

ప్రస్తుతం అందం, అభినయంతో వెండితెరపై అలరిస్తున్న మన ముద్దుగుమ్మలు.. చిన్నతనంలో చిలిపి పనులకు కేరాఫ్​ అడ్రస్​గా ఉండేవారట. ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిత్రసీమ గోపికమ్మల అల్లరి విశేషాలపై ఓ లుక్కేద్దాం రండి.

Sreekrishna janmastami telugu actresses childhood stories special
హీరోయిన్ల అల్లరి
author img

By

Published : Aug 11, 2020, 7:14 AM IST

Updated : Aug 11, 2020, 8:18 AM IST

నవ్వులు పూయించే అల్లరి పనులు.. ముద్దుగొలిపే చిలిపి చేష్టలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ శ్రీకృష్ణుడు. చిన్నతనంలో ఆ కృష్ణయ్య తన అల్లరి చేష్టలతో చూపిన మాయలు, బోధించిన సత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి చిలిపి పనులు ఆ వెన్నదొంగే కాదు.. చిన్నతనంలో మేమూ చాలానే చేశామంటున్నారు మన తెలుగు తెర గోపికమ్మలు.

నాన్నకు తెలియకుండా చేసిన దొంగతనాలు, పక్కింట్లో కొట్టుకొచ్చిన మామిడి కాయలు.. ఇలా చాలా తుంటరి పనులే చేశారట. చిన్నప్పుడు ఈ ముద్దుగుమ్మలు చేసిన ఆ అల్లరి పనులేంటో 'శ్రీకృష్ణజన్మాష్టమి' సందర్భంగా సరదాగా వారి మాటల్లోనే...

మామిడి కాయల దొంగని

"చిన్నతనంతో పోల్చితే నా అల్లరి కాస్త తగ్గిందనే చెప్పాలి. అప్పట్లో నేను నా స్నేహితురాలితో కలిసి ట్యూషన్‌కు వెళ్లొస్తుండేదాన్ని. ఒకసారి మేం నడుచుకుంటూ వస్తుంటే ఆ దారిలో ఒకింట్లో మామిడి చెట్టు కనిపించింది. వెంటనే నేను గబగబా ఆ చెట్టెక్కి కాయలు తెంపా. కానీ, ఇంతలో ఆ ఇంటి యజమానురాలు నన్ను చూసి, కేకలు వేస్తూ కర్ర పట్టుకొని వెంటపడింది. అయినా ఏదోలా అక్కడి నుంచి మామిడి కాయలు పట్టుకొని తుర్రుమన్నాం".

- రష్మిక

చెల్లి జడతో ప్రయోగాలు

"నేను చిన్నప్పుడు అల్లరిలో పెద్ద రౌడీనే. కానీ, ఏ తుంటరి పని చేసినా ఇట్టే దొరికిపోయేదాన్ని చిన్నప్పుడు ఎవరైనా పెద్దయ్యాకా నువ్వు ఏమవుతావు అంటే.. ఆస్ట్రోనాట్‌ లేదా హెయిర్‌ స్టైలిష్ట్‌ అవుతాననే దాన్ని. అయితే ఎందుకో తెలియదు కానీ వీటిలో కేశాలంకరణపై విపరీతమైన మక్కువ ఉండేది. అందుకే ఎప్పుడూ విభిన్న హెయిర్‌ స్టైల్స్‌తో ప్రయోగాలు చేస్తుండేదాన్ని. కానీ, ఈ ప్రయోగాలన్నీ చేసుకుంది నాపై కాదు. మా చెల్లి నిషాపై. ఎందుకంటే ఆ వయసులో నేను టామ్‌ బాయ్‌లా కటింగ్‌ చేసుకొని ఉండేదాన్ని. కాబట్టి నాపై అలాంటి ప్రయోగాలు చేసుకోవడానికి అవకాశముండేది కాదు. చెల్లి మాత్రం పొడవాటి జుత్తుతో ఆకర్షిస్తుండేది. అందుకే తనని బలవంతంగా కూర్చోబెట్టి తన జుత్తుతో విభిన్న రకాల హెయిర్‌ స్టైల్స్‌ ప్రాక్టీస్‌ చేస్తుండేదాన్ని. ఒకవేళ ఎప్పుడైనా నా పనికి తను ఒప్పుకోకపోతే రూ.50 ఇచ్చి మరీ బలవంతంగా కూర్చోబెట్టి తన జడ మీద ప్రయోగాలు చేసేదాన్ని. కొన్నిరోజులకు అలా చేసినా తనకి నా పని పట్ల విసుగొచ్చేసి అమ్మకు కంప్లైంట్‌ చెయ్యడం మొదలు పెట్టింది. దానికి నేను తననేం ఉత్తిగా కూర్చోబెట్టుకోవట్లేదు.. డబ్బులిచ్చి మరీ తనకి హెయిర్‌ స్టైల్స్‌ చేస్తున్నానని చెప్పేదాన్ని".

- కాజల్‌ అగర్వాల్‌

పాల గ్లాసులో నిద్ర మాత్ర..

"పదకొండో తరగతి చదువుకునే రోజుల్లో కొందరమ్మాయిలతో మేం గ్యాంగ్‌గా ఉండే వాళ్లం. అప్పటి వరకు మేం పార్టీలకు వెళ్లింది లేదు. ఒకరోజు మేమందరం ఏదైనా క్లబ్‌కి వెళ్లి.. అక్కడ ఎలా ఉంటుందో చూడాలి. డ్యాన్స్‌ చేస్తూ ఫుల్‌ ఎంజాయ్‌ చెయ్యాలి అనుకున్నాం. నిజానికి ఈ ఆలోచన నాది కాదు. నా స్నేహితులు లావణ్య, శరణ్యలది. ఈ పనికి ఓ రోజు రాత్రి మేం ముహూర్తం పెట్టుకున్నాం. అందరం ముందుగా అనుకున్నట్లుగా శరణ్య వాళ్లింటికి చేరుకున్నాం. అంటే ఆరోజు వాళ్ల అమ్మానాన్న లేరు. అందుకే అక్కడి నుంచి వెళ్లాలనుకున్నాం. కానీ, మాకు కాపలాగా శరణ్య అమ్మమ్మను ఉంచి వెళ్లారు వాళ్ల అమ్మావాళ్లు. మేమంతా ఆమె పడుకుంటే నెమ్మదిగా క్లబ్‌కి వెళ్లొచ్చెయ్యాలని రెడీ అయ్యి కూర్చొన్నాం. కానీ, ఆమె ఎంతసేపైనా పడుకోవట్లేదు. దీంతో శరణ్య వాళ్ల అమ్మమ్మ పాల గ్లాస్‌లో రెండు నిద్ర మాత్రలు వేసి ఆమెకిచ్చింది. దీంతో ఆమె ఒళ్లు తెలియకుండా నిద్రపోయింది. మేం డిస్కోకు వెళ్లి సరదాగా గడిపి వచ్చేశాం. కానీ, ఇప్పుడు తలచుకుంటే మాత్రం.. అప్పుడు మేం చేసిన పని ఎంత ప్రమాదకరమో కదా అని భయం వేస్తుంటుంది".

- సమంత

ఆ గౌను కోసం గోలగోల చేశా

"చిన్నప్పుడు అమాయకంగా కనిపిస్తూనే చాలా అల్లరి పనులు చేశా. వాటిలో అన్నింటి కన్నా బాగా గుర్తుండిపోయింది గులాబీ రంగు గౌను కోసం నేను చేసిన గోలే. చిన్నతనంలో నాకొక గులాబీ రంగు గౌను ఉండేది. అదంటే నాకు చాలా ఇష్టం. దాదాపు ఏడాది పాటు అది తప్ప మరో డ్రెస్‌ వేసుకునే దాన్ని కాదు. అమ్మ ఆ డ్రెస్‌ ఉతికినా అది ఆరే వరకు అలాగే బట్టల్లేకుండా ఉండేదాన్ని కానీ, మరోటి వేసుకునేదాన్ని కాదు. అంత పిచ్చి ఆ గౌనంటే. అమ్మకి నన్ను ఆ డ్రెస్‌లో చూసీ చూసీ చిరాకు పుట్టి దాన్ని ఎవరికో ఇచ్చేసింది. తర్వాత దాని కోసం నేను చాలా పెద్ద గోల చేశానట. ఈ విషయాన్ని ఇప్పటికీ అమ్మ నాకు గుర్తు చేస్తుంటుంది".

- తమన్నా

తలుపు వేసేసి దాక్కునేదాన్ని

"చిన్నప్పటి సంగతుల్ని, ఆనాటి నా అల్లరి పనుల్ని ఎప్పుడు తలచుకున్నా.. మనసు పులకిస్తుంటుంది. బాల్యంలోకి మళ్లీ పరుగు తియ్యాలనిపిస్తుంటుంది. చిన్నప్పుడు అందరిలాగే నేనూ బాగా అల్లరి చేస్తుండేదాన్ని. స్నానాల గదిలోకి ఎవరైనా వెళ్తే.. బయట నుంచి తలుపు గడియపెట్టేసి నేనెక్కడో దాక్కుండిపోయేదాన్ని. వాళ్లెంత అరచి గీపెట్టినా తీసేదాన్ని కాదు. చేతిలో రూపాయి నాణాలు ఉంటే.. తెలియకుండానే మింగేసే దాన్ని. క్రమంగా ఆ అలవాటు తగ్గించుకున్నా. ఇప్పుడా చిలిపి చేష్టలన్నీ తలచుకుంటుంటే చాలా నవ్వొస్తుంటుంది".

- కీర్తి సురేష్‌

Last Updated : Aug 11, 2020, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.