నాని, శ్రద్ధ శ్రీనాథ్‌లు జంటగా నటించి విజయవంతమైన సినిమా ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకొచ్చింది. దర్శకుడు గౌతమ్ ముందుగా శ్రద్ధ శ్రీనాథ్‌ని హీరోయిన్గా ఎంపిక చేయలేదు. విజయవంతమైన సినిమాల్లో నటించిన ఇతర కథానాయికల కోసం ప్రయత్నించారు. కథ విన్న తరువాత కొందరు ఆసక్తి చూపలేదు, మరికొందరు డేట్స్ ఖాళీ లేవన్నారు.
అప్పటికే శ్రద్ధ అయితేనే ఈ పాత్రకు సరిపోతుందని చిత్రబృందం భావించింది. అలా ఆమె కథానాయికగా మారింది. అనంతరం సినిమా విడుదలైంది... విజయం సాధించింది.. శ్రద్ధకి మంచి పేరు వచ్చింది.