Priyanka Sarkar Accident: ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో బంగాలీ నటి ప్రియాంక సర్కార్‌కు గాయాలయ్యాయి. ఆమె కాలు ఫ్రాక్చర్ అయింది. ఈ ప్రమాదంలో ఆమెతోపాటు ఉన్న బెంగాలీ నటుడు అర్జున్ చక్రవర్తి కూడా గాయపడ్డాడు.
![Priyanka Sarkar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13814637_img.jpg)
ఉత్తర కోల్‌కతాలోని రాజర్హత్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఓ వెబ్‌సిరీస్ చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాథమిక చికిత్స కోసం ప్రియాంకను స్థానిక ఆస్పత్రికి తరలించి, ఆ తర్వాత మెట్రోపాలిటన్ బైపాస్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఆమెకు సర్జరీ అవసరమని వైద్యులు తెలిపినట్లు వివరించారు. చికిత్స అనంతరం అర్జున్ చక్రవర్తి డిశ్ఛార్జ్ అయినట్లు పేర్కొన్నారు. వేగంగా వచ్చి ఢీకొట్టి, పరారైన బైకర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అతడు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ బంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా.. 'నిర్భయ' చిత్రంలో ప్రియాంక నటనకు ఉత్తమ నటి అవార్డు దక్కింది. అనుసంధాన్ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇదీ చూడండి: పూర్తిగా కోలుకున్న కమల్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్