ETV Bharat / sitara

జ్వాల కన్న జ్వాలాపుత్రుడు.. ఈ రాకీభాయ్!

'బెదిరి అదిరి చెదిరి పోయే సుక్కల్లో సందమామ లాగా, ఆకాశం చిరి అంచుల్లో దాక్కుని కూర్చున్నప్పుడు, జ్వాల కన్నది ఒక జ్వాలా పుత్రుడిని'.. ఒళ్లు గగుర్పొడిచే ఈ డైలాగ్​ వినగానే కండలు తిరిగిన దేహంతో మస్తిష్కంలో మెదిలే రూపం యశ్. నాన్న కాదన్నా.. అమ్మ వద్దాన్నా.. సినిమా దునియాను ఏలడానికి వచ్చాడు ఈ మాన్స్​టర్. రాకీ భాయ్​గా దేశవ్యాప్తంగా తన గురించి తెలిసేలా చేసుకున్నాడు. భువనహళ్లి నవీన్​కుమార్​ గౌడ.. పాన్​ ఇండియా స్టార్ యశ్​గా ఎలా మారాడో తెలుసా? నేడు అతడి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

special story on the occasion of Yash birthday
ఇండస్ట్రీని యేలడానికి వచ్చినవాడు.. తన గురించి తెలియజేశాడు
author img

By

Published : Jan 8, 2021, 8:50 AM IST

‘రాకీ భాయ్‌’గా ప్రేక్షకుల మనసులో చెదిరిపోని ముద్రవేసుకున్నాడు 'కేజీఎఫ్‌' హీరో యశ్‌. చిన్నతనం నుంచీ హీరో అవ్వాలని కలలు కని ఇంట్లోంచి పారిపోయి మరీ తన కలను నిజం చేసుకున్నాడు. సినీ నేపథ్యం లేకపోయినా స్టార్‌గా, పాన్‌ ఇండియా నటుడిగా ఎదిగి.. పేద రైతుల కన్నీళ్లు తుడుస్తున్న యశ్‌ నిజ జీవితంలోనూ హీరోనే. నేడు (జనవరి 8) అతడి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన గురించి తన మాటల్లోనే..

హీరో అంటే.. నవ్వారు!

"నాకు ఆ రోజు బాగా గుర్తుంది. మైసూరులో ఐదో తరగతి చదువుకుంటున్న రోజులవి. ఒకసారి టీచర్‌ 'నువ్వు పెద్దయ్యాక ఏమవుతావ్' అని క్లాస్‌లో అందరినీ అడుగుతున్నారు. టీచర్‌, డాక్టర్‌, పోలీస్‌.. ఇలా రకరకాల రంగాల పేర్లు చెబుతున్నారు నాతోటి పిల్లలు. నా వంతు వచ్చినపుడు 'నేను సినిమా హీరోనవుతా..' అని గర్వంగా చెప్పా. కానీ క్లాస్‌లో అందరూ నవ్వారు. నేను హీరో అవకూడదా.. కలలు కనడం తప్పా.. ఎందుకు అందరూ అలా నవ్వుతున్నారని ఆరోజు ఎంత బాధేసిందో. అప్పట్నుంచీ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆ లక్ష్యాన్ని మాత్రం నా మనసులోంచి తీసేయలేదు. సినీ నేపథ్యం లేకపోయినా ఒక్కోమెట్టూ ఎక్కుతూ 'కేజీఎఫ్‌ చాప్టర్‌ 1'తో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగే వరకూ ప్రతి క్షణం కష్టపడ్డా. అయితే ఆ విజయం నాకంత తేలిగ్గా రాలేదు. దానికోసం చాలా కష్టపడ్డా. అందుకే ఎవరడిగినా 'కేజీఎఫ్‌'కి ముందూ తరవాతా అంటూ నా జీవితాన్ని రెండుగా విభజించి చెబుతుంటా"

special story on the occasion of Yash birthday
యశ్

కేజీఎఫ్‌కి ముందు..

"మాది కర్ణాటకలోని హసన్‌ జిల్లా భువనహళ్లిలో మధ్యతరగతి కుటుంబం. నాన్న కేఎస్‌ఆర్టీసీలో బస్సు డ్రైవర్‌. అమ్మ గృహిణి. చెల్లి నందిని. నా ఆరో ఏట నాన్నకి మైసూరుకు బదిలీ అవడం వల్ల నా చదువంతా అక్కడే సాగింది. చిన్నతనంలో నాన్నకి సైకిల్‌ కొనిచ్చే స్థోమత కూడా ఉండేది కాదు. అందుకే గంటకి రూపాయి చెల్లించి సైకిల్‌ అద్దెకి తీసుకుని తొక్కేవాడిని. చిన్న చిన్న ఇబ్బందులూ, ఆర్థిక సమస్యలూ ఉన్నా ఎక్కడా ఏదీ లోటు అని ఫీలవకుండా పెరిగా. అలానే సినిమాలు బాగా చూసేవాడిని. ఏ సినిమా చూస్తే ఆ హీరోలా ఫీలయ్యేవాడిని. అందుకే హీరో కావాలనే ఆలోచన చిన్నతనంలోనే మనసులో పడింది. నాన్నకి మాత్రం నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఉండేది. కానీ నేను పట్టించుకునేవాడిని కాదు. స్కూల్‌లో ఏ కార్యక్రమం జరిగినా అందులో చురుగ్గా పాల్గొనేవాడిని. ఏ చిన్న అవకాశం దొరికినా వేదికపైన కనిపించడానికి తహతహలాడేవాడిని.

అలా సెకండ్‌ పీయూసీ పూర్తి చేశాక.. అంటే పదిహేడేళ్ల వయసులో-చదువు మానేద్దామని నిర్ణయించుకున్నా. అమ్మానాన్నలు అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఏంచేయాలో తెలియక వాళ్లకు చెప్పకుండా నాన్న జేబులోంచి రూ.300లు తీసుకుని బెంగళూరు పారిపోయా. అక్కడకు వెళ్లాక చాలా భయమేసింది. డబ్బులు అయిపోయాక ఇంటికి వెళ్లిపోదామనుకున్నా. అలా వెళితే అమ్మానాన్నలు ఇంట్లోకి రానిస్తారో లేదో తెలియదు. ఒకవేళ రానిచ్చినా వాళ్లు ఏది చెబితే అదే చేయాలి. నాకలా ఇష్టం లేదు. అందుకే ఎలాగైనా నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే నిర్ణయించుకున్నా. చాలా రోజులు ప్రయత్నిస్తే ఓ థియేటర్‌ బృందం నన్ను వాళ్ల ట్రూపులో చేర్చుకుంది. తీరా వెళ్లాక ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోగా.. నాతో టీలూ, సిగరెట్లూ తెప్పించుకుని నానా చాకిరీ చేయించుకునేవారు. అయినా ఓపికతో వాళ్ల బృందంలోనే ఉన్నా.

ఒకరోజు నాటకం వేసే సమయానికి ఒక ఆర్టిస్టు రాకపోవడం వల్ల ఆ పాత్ర నాకు ఇచ్చారు. నటనతో అదరగొట్టేశా. అక్కడికి వచ్చిన వాళ్లందరికీ ప్రదర్శన నచ్చింది. అప్పుడు మా బృందంలోని సభ్యులు నన్ను నటుడిగా గుర్తించి ఆ తరవాత నుంచీ పాత్రలు ఇవ్వడం మొదలుపెట్టారు. నేనూ అలా నాటకాలు వేస్తూ.. వచ్చిన డబ్బులతోనే గడుపుకునేవాడిని. కొన్నాళ్లకి నా తపనను అర్థం చేసుకున్న నాన్న మనసు మార్చుకుని డబ్బులు పంపుతానన్నారు. కష్టం, రూపాయి విలువా నాకు తెలియాలని నేనే పంపొద్దన్నా. ఉన్న రోజున తిని లేని రోజున పస్తులు ఉండటం అలవాటు చేసుకున్నా. అలా చేస్తూనే టెలివిజన్‌ రంగంలో పరిచయాలు పెంచుకోవడం మొదలుపెట్టా.

ఈటీవీ కన్నడలో అవకాశం

కొన్నాళ్లకి ఈటీవీ కన్నడలో ప్రసారమయ్యే 'నందగోకుల' అనే సీరియల్‌లో నటించే ఛాన్సు వచ్చింది. తరవాత మరికొన్ని సీరియళ్లలో అవకాశాలు వచ్చాయి. ఏడాది తిరిగేసరికి ఐదు సీరియళ్లు చేతిలో ఉన్నాయి. అన్నింటిలోనూ హీరో పాత్రే. దాంతో ఆదాయం పెరగడం వల్ల ఒక బైకు కొనుక్కున్నా. షూటింగులకి కూడా దానిపైనే వెళ్లేవాడిని. కానీ చాలామంది 'టీవీ ఆర్టిస్టుగా మంచి ఫామ్‌లో ఉన్నావు.. బండిమీద వెళ్లడం చీప్‌గా ఉంటుంది. కారు కొనుక్కోవచ్చుగా' అనేవారు. నేను వచ్చిన సంపాదనంతా కాస్ట్యూమ్స్‌కే ఖర్చుపెట్టేవాడిని. ఒక సీరియల్‌లో వేసుకున్నవి మరో దాన్లో వాడేవాడిని కాదు. ప్రతి సీన్‌లో తాజాగా.. నన్ను నేను కొత్తగా ప్రజెంట్‌ చేసుకోవడానికి తాపత్రయపడేవాడిని. సినిమా ఇండస్ట్రీలో కూడా నిదానంగా పరిచయాలు పెంచుకుంటూ నా పోర్టుఫోలియో చూపిస్తూ ఉండేవాడిని. అలా తిరుగుతుండగా 2008లో 'మొగ్గిన మనసులు' అనే సినిమాలో అవకాశం వచ్చింది. అందులో పాత్రకి నాకు ఉత్తమ సహనటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వచ్చింది. ఆ తరవాత వచ్చిన 'రాకీ' చిత్రంలో హీరోగా చేశా. ఇక అప్పట్నుంచీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కథలు ఒకటికి రెండుసార్లు వింటూ యువతకు ఏది నచ్చుతుందో చూసుకుని ఆచితూచి నిర్ణయం తీసుకునేవాడిని. చాలా తక్కువ కాలంలోనే హీరోగా నిలదొక్కుకోగలిగా."

కేజీఎఫ్‌ తరవాత..

"2014లో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ నాకు 'కేజీఎఫ్‌' కథ చెప్పాడు. రాకీ పాత్ర బాగా నచ్చేసింది. వెంటనే ఒప్పేసుకున్నా. ఆ తరవాత నేను కూడా కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌ గురించి బోలెడు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నా. రాకీ పాత్ర కోసం కండలతోపాటు గడ్డం, జుట్టు కూడా పెంచాల్సి వచ్చింది. జిమ్‌లో ఆరు నెలలు కష్టపడి సిక్స్‌ ప్యాక్‌ తెచ్చుకున్నా. ఒకసారి కేజీఎఫ్‌ చర్చల్లో భాగంగా మా సినిమా బృందంతో కొన్నాళ్లు బెంగళూరులోని తాజ్‌ హోటల్‌లో ఉన్నాం. అప్పుడే రాజమౌళి సర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' పనుల్లో భాగంగా అక్కడికి వచ్చారు. అప్పుడు ఆయన్ని కలిసి మా సినిమాకి సంబంధించి కొన్ని విజువల్స్‌ చూపించాం. అవి చూసి ఆయన సినిమా మంచి హిట్‌ అవుతుందని అప్పుడే చెప్పారు. దాంతోపాటు బాలీవుడ్‌లో కొందరు డిస్ట్రిబ్యూటర్లకి కూడా ఆ విషయం చెప్పి మాకెంతో మేలు చేశారు.

కేజీఎఫ్ 2 వర్కింగ్ స్టిల్

'కేజీఎఫ్‌' కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లోనూ విడుదల చేయాలనుకున్నప్పుడు నేను ఆ భాషలన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టా. ఎందుకంటే మన దగ్గరకు వేరే ప్రాంతం వాళ్లు వచ్చినపుడు వాళ్ల భాష మాట్లాడితే మనకేమీ అర్థం కాదు, పైగా వాళ్లని ఓన్‌ చేసుకోలేం. అదే మన భాష మాట్లాడితే మనకెంతో గౌరవం ఇస్తున్నారు అనిపిస్తుంది. మనవాళ్లలా దగ్గర అవుతాం. అందుకే నేను ఏ రాష్ట్రంలో 'కేజీఎఫ్‌' ఈవెంట్‌ జరిగితే అక్కడ ఆ భాషలో మాట్లాడి ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యా. ఇప్పుడు ఎక్కడికెళ్లినా అందరూ నన్ను 'రాకీ భాయ్‌' అంటూ తమవాడిలా ఓన్‌ చేసుకుంటున్నారు. దాదాపు రెండేళ్లలో 180 రోజులు చిత్రీకరించాం. గోల్డ్‌ మైన్స్‌ సెట్‌ వేయడం, అది వర్షాలకో గాలిదుమ్ములకో చెదిరిపోవడం జరిగేది. దాంతో షూటింగ్‌ చాలా ఆలస్యమవుతుండేది. ద్వితీయార్ధమంతా మైనింగ్‌ సెట్‌లోనే షూటింగ్‌. అక్కడ దుమ్ముకి కళ్లు మండిపోయేవి. చర్మం కూడా పాడైంది. అవన్నీ ఇబ్బందులని ఎప్పుడూ అనుకోలేదు."

వేల ఎకరాలకు నీళ్లు..

"ఉత్తర కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లాలో వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తాళ్లూరు చెరువునీటిపైనే చుట్టపక్కల 25 గ్రామాల ప్రజలు ఆధారపడతారు. అయితే 2012 తరవాత వర్షాలు పడక ఈ చెరువు ఎండిపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని గ్రామాల్లో తాగునీళ్లు లేక ప్రజలు దాహంతో అల్లాడారు. మేతా, నీళ్లూ లేక కొన్నిచోట్ల పశువులు మృత్యువాత పడ్డాయి. ఆ విషయం తెలిసి రైతుల వద్దకు వెళ్లా. వాళ్ల దుర్భర జీవితాన్ని మార్చాలంటే చెరువుల నిండా నీళ్లు నింపడం ఒక్కటే సరైన మార్గమని అర్థమైంది. అందుకే 2016లో 'యశోమార్గ ఫౌండేషన్‌'ను స్థాపించి అలానే కాల్బుర్గీ, రాయ్‌చూర్‌, గడగ్‌, బెళగావి, బీదర్‌, యాద్గిరి, బాగల్‌కోట ప్రాంతాల్లోని అరవై గ్రామాల్లో చెరువుల పూడికలు తీయించి రైతన్నలకు అండగా ఉన్నా. ఇప్పటికీ మరికొన్ని గ్రామాల్లో ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వేసవిలో పశువులకు మేత అందిస్తూ, ట్యాంకర్లు పంపి ఇంటికో డ్రమ్ము నీళ్లు సరఫరా చేస్తున్నా. వర్షాలు పడి బావుల్లోకి నీళ్లు వచ్చాక రెండ్రోజులకోసారి తాగు నీళ్లు అందిస్తున్నా. నిరుపేద రైతులకు ఉచితంగా విత్తనాలూ ఎరువులూ ఇస్తూ వారిని వ్యవసాయం దిశగా మరింతగా ప్రోత్సహిస్తున్నా. ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు ఇక ముందు కూడా చేయాలనుకుంటున్నా.

కుటుంబంతో యశ్

సహనటితో వివాహం

నా భార్య రాధికా పండిట్‌. మాది ప్రేమ వివాహం. తను కూడా నటి. మేం ఇద్దరం కలిసి మూడు సినిమాల్లో నటించాం. ‘నందగోకుల’ సీరియల్‌లో నాతోపాటే చిన్నితెరకు పరిచయమైంది. అలానే ఇద్దరం 'మొగ్గిన మనసులు' చిత్రంతోనే వెండితెరపైకి వచ్చాం. అప్పుడే ఇద్దరం ప్రేమలో పడ్డాం. దాదాపు ఎనిమిదేళ్ల ప్రేమ తరవాత 2016లో పెళ్లి చేసుకున్నాం. మాకో పాపా, బాబూ.

ప్రస్తుతం నాన్న బెంగళూరులోనే పని చేస్తున్నారు. ఆ ఉద్యోగం మానేయమని ఎన్నోసార్లు చెప్పినా వినలేదు. ఆయనకు ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. ఇక, మా అమ్మ కూడా ఎక్కడికి వెళ్లినా బస్సుల్లో, ఆటోల్లో వెళుతుంది. వాళ్లిద్దరికీ సాధారణ జీవితం గడపడం ఇష్టం. ఇప్పటికీ నేను నిద్రలేచాక దుప్పటి మడతపెట్టకపోయినా, స్నానం చేశాక తువాలు ఆరేయకపోయినా నాన్న అస్సలు ఊరుకోరు, కోప్పడతారు. అలానే నేనొక బస్‌ డ్రైవర్‌ కొడుకునని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతా."

రామ్​చరణ్​లా..

రాకింగ్ స్టార్ యశ్

"నేను హైదరాబాద్‌ వచ్చినప్పుడు చాలామంది 'మీరు రామ్‌చరణ్‌లా ఉన్నారు' అంటుంటారు. ఇప్పుడంటే కాస్త గుబురు గడ్డం వల్ల పోల్చుకోకపోవచ్చు. ఇంతకుముందు నా ఫొటోలు చూసుకుంటే నాకే అలా అనిపిస్తుంటుంది. నా జుట్టు చాలా సిల్కీగా ఉంటుంది. కేజీఎఫ్‌ కోసం కాస్త పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా ‘మీ జుట్టుకి ఏం వాడతారంటూ ఆడవాళ్లు అడుగుతుంటే నాకు నవ్వొస్తుంటుంది.

నా అసలు పేరు నవీన్‌ కుమార్‌ గౌడ. సీరియళ్లలోకి వచ్చే ముందు జాతకం చూపించుకుంటే నక్షత్రం ప్రకారం 'య'తో పేరు పెట్టుకోమన్నారు. అప్పుడు యశ్‌గా మార్చుకున్నా. నేను సెట్‌లో చాలా సైలెంట్‌గా ఉంటా. తరవాత సీన్‌ ఏంటో చదువుకుని బెటర్‌గా రావడానికి ప్రయత్నిస్తుంటా. కానీ చాలామంది 'వీడికి ఎంత ఆటిట్యూడో..' అంటూ కామెంట్‌ చేస్తుంటారు."

కేజీఎఫ్ 2

ప్రస్తుతం 'కేజీఎఫ్‌ చాప్టర్‌2' చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. జనవరి 8న యశ్ బర్త్​డే కాగా ఒకరోజు ముందుగానే టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. టీజర్​.. సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.

ఇదీ చూడండి: 'కేజీఎఫ్​ 2' టీజర్​: మాట నిలబెట్టుకుంటానంటున్న యశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.