"సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలీదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది".. 'ఆగడు' సినిమాలో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రాలకు ఇది సరిగ్గా సరిపోతుంది. అతడు తీసిన 'సరిలేరు నీకెవ్వరు'.. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో నటీనటులు చేసిన వివిధ మేనరిజమ్స్ అలరిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'సరిలేరు నీకెవ్వరు'లో వివిధ మేనరిజమ్స్
- 'దేవుడా ఒక క్యూట్, స్వీట్, హ్యాండ్‌సమ్ కుర్రాణ్ని చూపించవయ్యా! నీకు అర్థమవుతుందా', 'ఐ లవ్ వ్యూ.. మీకు అర్థమవుతుందా'
- 'అబ్బ...బ్బ...బ్బ.. ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్'
- 'అబ్బ..బ్బ..బ్బ.. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్'
- 'మ్యావ్.. మ్యావ్ పిల్లి.. మిల్క్‌బాయ్‌తో పెళ్లి'
- 'చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది'
- 'రమణా లోడు ఎత్తాలిరా.. చెక్ పోస్ట్ పడతాది'
ఒక్కో దర్శకుడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఏ కథ ఎంచుకున్నా అందులో పక్కాగా కామెడీ ఉండాల్సిందే. ఈ విషయం అతడు గత చిత్రాలు చూస్తే తెలుస్తుంది. అయితో ఆ కామెడీలోనూ వినూత్న ప్రయెగాలు చేస్తుంటాడు. గతంలోనూ అతడు తీసిన సినిమాల్లో క్యాచీ సంభాషణలు ఇవే.
- రవితేజ 'రాజా ది గ్రేట్'లో 'ఇట్స్ లాఫింగ్ టైం. హు.. హు.. హు..హు హూ..'.
- వెంకటేశ్, వరుణ్, తమన్నా, మెహరీన్‌ల 'ఎఫ్ 2'లో.. మెహరీన్ చెప్పే 'హనీ ఈజ్ ద బెస్ట్', వెంకీ, వరుణ్‌ల 'అంతేగా అంతేగా'
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: