డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్(aryan khan news)కు ఎన్సీబీ ప్రత్యేక న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ ధమేచాల కస్టడీని ఈ నెల 30 వరకు పొడిగించింది. దీంతో అప్పటివరకు ఆర్యన్ జైలులోనే ఉండనున్నాడు. అయితే, నిందితులను భౌతికంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారాగానీ అధికారులు కోర్టులో హాజరుపరచలేదు.
ముంబయి శివారులోని క్రూజ్ నౌకలో డ్రగ్స్ కేసులో అక్టోబర్ 3న ఆర్యన్(aryan khan news) సహా ఏడుగురిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. అక్టోబర్ 7న ముంబయి ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో నిందితులకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆర్యన్ ప్రస్తుతం ఆర్ధర్ రోడ్డులోని జైలులో ఉంటున్నాడు.
బాంబే కోర్టులో బెయిల్ పిటిషన్
బెయిల్(aryan khan bail) కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకోగా ఆ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. దీంతో కింది కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఆర్యన్ తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టులో బుధవారం బెయిల్(aryan khan bail) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అక్టోబర్ 26న విచారణ జరగనుంది.