ETV Bharat / sitara

అలాంటి కథలో హీరోగా చేస్తా: దేవిశ్రీ ప్రసాద్ - Sarileru Neekevvaru

దేవిశ్రీ ప్రసాద్.. తన సంగీతంతో కుర్రకారుకు కిక్కెక్కిస్తూ.. చిత్రసీమలో అగ్రసంగీత దర్శకుడిగా దూసుకెళ్తున్నాడు. తాజాగా మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు దేవిశ్రీ.

Special Chit Chat With Devisri Prasad
దేవిశ్రీప్రసాద్
author img

By

Published : Jan 11, 2020, 9:54 AM IST

'ప్రతి సినిమాకూ నాలో ఒక భయం ఉంటుంది. అలాంటి భయం ఉన్నప్పుడే దేన్నయినా సవాల్‌గా స్వీకరించి పనిచేస్తాం' అన్నాడు దేవిశ్రీ ప్రసాద్‌. ఫాస్ట్‌ బీటైనా, మెలోడీ అయినా పాటపై ఆయన ముద్ర ప్రత్యేకంగా వినిపిస్తుంటుంది. సాహిత్యంపై పట్టున్న సంగీత దర్శకుల్లో దేవి ఒకరు. ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు'కి స్వరాలు సమకూర్చాడు. ఆ చిత్రం శనివారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం దేవిశ్రీ ప్రసాద్‌ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించాడు.

భయభక్తులతో చేశా..

ఈ ఏడాదిలో విడుదలవుతున్న నా మొదటి సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. తొలి సినిమా చేసిన అనుభూతినిచ్చింది. తొలి సినిమా అంటే ఎంతో భయభక్తులతో చేస్తాం. అలాంటి భయం ఉన్నంతకాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Special Chit Chat With Devisri Prasad
దేవిశ్రీప్రసాద్

మహేశ్​తో మాస్ పాట కోరిక తీరింది..

మహేశ్​ కథానాయకుడిగా నేను చేసిన ఐదో సినిమా ఇది. అంత పెద్దస్టార్‌ మనమీద నమ్మకంపెట్టినప్పుడు తెలియకుండానే పనిపైన గౌరవం పెరుగుతుంది. ‘సరిలేరు..’ ప్రారంభం రోజున మహేష్‌ అభిమానులందరికీ నచ్చేలా ఒక మాస్‌ పాట ఇస్తానన్నా. అందుకు తగ్గట్టే ‘మైండ్‌ బ్లాక్‌’, ‘డాంగ్‌ డాంగ్‌’ పాటలకు గొప్ప స్పందన లభిస్తోంది. మహేశ్​కు మాస్‌పాట ఇవ్వాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరింది.

Special Chit Chat With Devisri Prasad
దేవిశ్రీప్రసాద్

ఆర్మీకి నివాళిగా రాశా..

నాకు భారత సైన్యం అంటే ఎంతో గౌరవం. ఇప్పటివరకు ఆ నేపథ్యంలో ఏ సినిమా చేయలేదు. అనిల్‌ చెప్పడంతోనే ఆర్మీకి ఒక నివాళి లాంటి సినిమా అన్నారు. ఆ స్ఫూర్తితోనే 'భగ భగ భగ మండే నిప్పుల వర్షమొచ్చినా... ' పాట రాశా. యూరప్‌లో మెసెడోనియన్‌ సింఫనీ ఆర్కెస్ట్రాతో రికార్డ్‌ చేశాం. నా దృష్టిలో ఒక అగ్ర కథానాయకుడి నుంచి మాస్‌ పాట వచ్చినప్పుడు అది ప్రేక్షకుడికి కనెక్ట్‌ అవ్వాలి. హీరోకి కూడా ఆ పాటతో లింక్‌ ఉండాలి. ఇందులో మహేష్‌ పక్కా మాస్‌తో కనిపిస్తాడు కాబట్టి ఇందులోని 'మైండ్‌ బ్లాక్‌..’ పాటలో..' ఎప్పుడూ ప్యాంటేసేవాడు, ఇప్పుడు లుంగీ తొడిగాడు’ అని రాశాం. థియేటర్‌లో ఈ పాట మరో స్థాయిలో ఉంటుంది.

Special Chit Chat With Devisri Prasad
దేవిశ్రీప్రసాద్

హీరోగా చేస్తా..

తదుపరి అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కలయికలో సినిమా చేస్తున్నా. అలాగే వైష్ణవ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న 'ఉప్పెన'తో పాటు నితిన్‌ - కీర్తిల 'రంగ్‌దే', కీర్తి సురేష్‌ 'గుడ్‌లక్‌సఖి' సినిమా కూడా చేస్తున్నా. హిందీలోనూ ఒక సినిమా చేయబోతున్నా. సంగీతంపై ఆసక్తివల్లేమో నటించాలన్న ఆసక్తి రావడం లేదు. కథానాయకుడిగా నటించమని తమిళంలో నాకు ఎక్కువమంది కథలు చెబుతున్నారు. సంగీతం ప్రధానంగా సాగే కథ ఏదైనా వస్తే చేస్తానేమో.

ఇదీ చదవండి: రివ్యూ: మీకు అర్థమవుతుందా.. బొమ్మ అద్దిరిపోయింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.