ETV Bharat / sitara

'ప్రేమ ఎంత మధురం.. మీ స్వరం అంత సుమధురం'

ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తన గాత్రంతో కోట్లాది మంది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. సంగీత ప్రపంచంలో సామ్రాట్​గా గుర్తింపు పొందారు. ఆయన గొంతు నుంచి జాలువారిన పాటల్ని శ్రోతలు అంత తొందరగా మర్చిపోలేరు.

SP balasubrahmanyam songs will remain in hearts
'ప్రేమ ఎంత మధురం.. మీ స్వరం అంత సుమధురం'
author img

By

Published : Sep 26, 2020, 8:14 AM IST

Updated : Sep 26, 2020, 9:00 AM IST

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయనే మనమంతా ఆప్యాయంగా పిలుచుకునే ఎస్పీ బాలు. అసమాన ప్రతిభా పాటవాలతో వేలాది పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు. తెలుగు పాట ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సంగీత విద్వాంసుడు. నెల్లూరులో పుట్టి.. సంగీత ప్రపంచంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన సంగీత సామ్రాట్‌ మననుంచి దూరమైనా పాట రూపంలో చిరంజీవిగా నిలిచే ఉంటారు.

ప్రేమ.. ఈ రెండక్షరాలకు నిజమైన నిర్వచనం మీ గొంతు.

ప్రేమించడానికి రెండు హృదయాలు మాత్రమే సరిపోవు.. బాలు పాట కూడా ఉండాలి అంతే.

'ప్రేమ ఎంత మధురం'.. మీ స్వరం అంత సుమధురం మరి.

'హలో గురు ప్రేమ కోసమే రా జీవితం' అనిపించి 'వై నాట్' అని చిలిపిగా చిరునవ్వుతో పాటగా పరిచయం అయ్యారు.

'మాటే రాని చిన్నదాని' కళ్లలోకి చూస్తూ మౌనంగా ప్రేమ కోసం నిరీక్షించే రోజుల్లో 'ప్రేమించుటేనా నా దోషము' అంటూ తడి ఆరని కన్నీరు పెట్టించిన మీ విరహ గానం చెరగని ముద్రగా మిగిలింది ఎన్నో హృదయాలపై.

'ప్రేమ లేదని ప్రేమించ రాదని' ప్రేమలో ముంచెత్తారు.. ఆ మత్తు... ఆ మైమరపు చివరి శ్వాస వరకు దాచుకునే ఆరాధకులు నాలా ఎంతో మంది.

'ఓ పాపా లాలీ... జన్మ కే లాలీ' అంటూ విరహ గీతాన్ని ఎంతో తీయగా ఆలపించిన మీ స్వరం లేకుంటే ప్రేమకు అర్థం ఉంటుందా?

'ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా' పాట వింటూనే కదా ప్రేమను పలకరించాం. నింగీ నేలా సరిపోనంత ప్రేమను పాటతో పంచి ఇప్పుడు పాటను ప్రేమగా ఇచ్చి పలకకుండా ఉన్నారేం.

'చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట విని పోవాలి' అంటూ మా మాటలు, బాధలు, భావాలు వింటూ.. కంటూ.. బతికించిన, బతుకు పంచిన మధుర గానం మాకు ఎందు కంత దూరంగా వెళుతోంది.

'ఏదో ఒక రాగం' అంటూ కోట్ల రాగాలను పంచి మా మనసులు పులకించిన ఆ క్షణాలను తలుస్తూ 'జ్ఞాపకాలె మైమరపు.. జ్ఞాపకాలె నిట్టూర్పు, జ్ఞాపకాలె ఓదార్పు' అనుకోక తప్పడం లేదే!

'పాటల పల్లకివై ఊరేగే చిరు గాలి' అంటూ ప్రేమ పల్లకీలో ఊరేగించారు.

'ఏ కొమ్మ కా కొమ్మ కొంగత్త రాగం' అంటూ ఎన్నెన్ని మధురిమలు పంచారు.

'ఎన్నెన్నో అందాలు... ఏవేవో రాగాలు' పాటతో 'పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం' అన్నట్లు

మనసు లో లోతుల్లో ప్రేమ పదనిసలతో పులకింతలు పుట్టించారు.

'తకిట తదిమి తకిట తదిమి' అంటూ మనసును నాట్యం చేయించిన మధుర గానం

'శృతిని లయను ఒకటి చేసి' మీ స్వరమును నాట్య శిఖరంగా నిలిపింది.

'ఎదుటా నీవే ఎదలోనా నీవే' అన్న మీ సుస్వరం ఎప్పటికీ మరపు రాని స్నేహంగా, వీడిపోని బంధంగా ఉంటుంది. గెలుపులో స్ఫూర్తిగా.. ఓటమిలో నిస్పృహను తరిమేసే ధైర్యంగా మీ పాట బతికి ఉంటుంది. ఎంతో మందిని బతికిస్తుంది ప్రేమగా.. ప్రేమతో.. మీ అభిమాని.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Sep 26, 2020, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.