దక్షిణాది కథానాయిక అమలాపాల్.. తన ప్రియుడు, సింగర్ భవిందర్ సింగ్‌ను వివాహం చేసుకుంది. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ పలువురు అభిమానులు వీటిని షేర్ చేస్తున్నారు. దర్శకుడు ఏ.ఎల్ విజయ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడని అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అతడు ఎవరనేది మాత్రం అప్పుడు వెల్లడించలేదు.
![South Indian actress Amala Paul tie knot with boyfriend Bhavninder Singh in second marriage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6481658_amalaa222.jpg)
ఆ తర్వాత అమలాపాల్‌తో తీసుకున్న ఫొటోలను ముంబయికి చెందిన గాయకుడు భవిందర్ సింగ్ పలు సందర్భాల్లో పోస్ట్ చేశాడు. ఆమెను హత్తుకుని ఉన్న ఫొటోను పంచుకోగానే, వీరిద్దరూ 'ప్రేమలో ఉన్నారు' అంటూ వదంతులు ప్రారంభమయ్యాయి. అమలాపాల్ ప్రియుడు ఇతడేనా? అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారంపై అమలాపాల్ స్పందించలేదు. ఎట్టకేలకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అమలాపాల్, భవిందర్ సింగ్ ఇంకా పెళ్లి వార్తలపై స్పందించలేదు. అయితే పెళ్లి ఫొటోలను తొలుత షేర్ చేసిన భవి... తర్వాత తొలిగించాడు.
![South Indian actress Amala Paul tie knot with boyfriend Bhavninder Singh in second marriage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6481658_amala222.png)
2014లో అమలాపాల్ తమిళ దర్శకుడు ఎ.ఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని కారణాల వల్ల 2017లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. 2019 జులైలో విజయ్ రెండో వివాహం చేసుకున్నాడు.
![South Indian actress Amala Paul tie knot with boyfriend Bhavninder Singh in second marriage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6481658_amala180.jpg)
ఇదీ చదవండి...