ETV Bharat / sitara

అలీకి హీరోయిన్​గా చేయనని చెప్పేసిన సౌందర్య - Ali yamaleela heroine

Ali soundarya movie: అలీ సరసన హీరోయిన్​గా నటిస్తానని తొలుత ఒప్పుకొన్న సౌందర్య.. తర్వాత చేయనని చెప్పేసింది. ఇంతకీ అది ఏ సినిమా? అప్పుడు ఏం జరిగింది?

ali soundarya
అలీ సౌందర్య
author img

By

Published : Feb 20, 2022, 7:26 PM IST

Ali yamaleela movie: బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, హాస్య నటుడిగా రాణించి, కథానాయకుడిగా ఎదిగిన వ్యక్తి అలీ(Ali). ప్రస్తుతం తనదైన నటనతో నవ్వులు పంచుతున్నారు. అలీ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం 'యమలీల'. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు. నటుడిగా అలీ స్టార్‌డమ్‌ను పెంచింది. సంగీత పరంగానూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ కథకు అలీని కథానాయకుడిగా తీసుకుందామని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అనుకున్నప్పుడు చాలామంది వద్దని సలహా ఇచ్చారట. అయితే, ఎస్వీ కృష్ణారెడ్డి మాత్రం అలీ అయితేనే ఈ కథకు సరిపోతాడని భావించి, ఆయననే ఓకే చేశారు. ఇక కథానాయిక ఎంపిక విషయంలో తొలి ప్రాధాన్యం సౌందర్యకు ఇచ్చారు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే, తొలుత ఒప్పుకొన్నా, ఆ తర్వాత అలీ హీరో అని తెలియడం వల్ల తన తండ్రి సూచనమేరకు సినిమా నుంచి తప్పుకొన్నారు. దీంతో ఇంద్రజను కథానాయిగా తీసుకున్నారు.

1994 ఏప్రిల్‌ 28న విడుదలైన 'యమలీల' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 'భవిష్యవాణి' చూసి తన తల్లి చనిపోతుందని తెలిసినప్పుడు అలీ పలికించిన హావభావాలు చూసి, ఆయనను కథానాయకుడిగా తీసుకోవద్దన్న వారు సైతం హ్యాట్సాఫ్‌ అనేలా చేశారు అలీ. అయితే, ఆ తర్వాత అలీతో కలిసి సౌందర్య ఓ డ్యుయెట్‌లో ఆడిపాడారు. 'శుభలగ్నం' చిత్రంలో 'చినుకు చినుకు అందెలతో' పాట కోసం సౌందర్యను అడిగితే మరో ఆలోచన లేకుండా ఆమె ఒప్పుకొన్నారట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.