ETV Bharat / sitara

కాలినడకన ముంబయి వచ్చిన వ్యక్తికి సోనూ భరోసా - సోనూ కోసం కాలినడకన ముంబయికి

కరోనా కష్టకాలంలో రియల్ హీరోగా మారిన సోనూసూద్​ను కలవడానికి కాలినడకన ముంబయి బయల్దేరి వార్తల్లో నిలిచాడు వికారాబాద్​కు చెందిన వెంకటేశ్. తాజాగా ఇతడిని కలిసిన సోనూ.. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేశాడు.

sonusood
సోనూసూద్
author img

By

Published : Jun 10, 2021, 9:55 PM IST

కరోనా కష్టకాలంలో అవసరం ఉన్న వారికి అండగా నిలుస్తూ వస్తున్న నటుడు సోనూసూద్​కు వినతుల వెళ్లువ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. చాలామంది ఈ నటుడికి సామాజిక మాధ్యమాల ద్వారా వినతులను విన్నవిస్తున్నారు. అయితే ఓ యువకుడు మాత్రం సోనూను కలవడానికి వికారాబాద్ నుంచి ముంబయికి పయనమై వార్తల్లో నిలిచాడు. తాజాగా ఈ విషయాన్ని తెలుసుకున్న సోనూ.. అతడిని కలిసి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

  • Venkatesh, walked barefoot all the way from Hyd to Mumbai to meet me, despite me making efforts to arrange some sort of transportation for him. He is truly inspiring & has immensely humbled me
    Ps. I, however, don’t want to encourage anyone to take the trouble of doing this, ❣️ pic.twitter.com/f2g5wU39TM

    — sonu sood (@SonuSood) June 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"వెంకటేశ్.. నన్ను కలవడానికి హైదరాబాద్ నుంచి ముంబయి కాలినడకన వచ్చాడు. నేను అతని కోసం ఒక విధమైన రవాణాను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ నిరాకరించాడు. ఇతడు నిజంగా నాకు స్ఫూర్తిగా నిలిచాడు. ఏది ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి ఇబ్బందుల్ని నేను ఎప్పటికీ ఒప్పుకోను."

-సోనూసూద్, నటుడు

వికారాబాద్ జిల్లా డోర్నపల్లికి చెందిన వెంకటేశ్ జూన్ 1న తన పాదయాత్రను ప్రారంభించాడు. ఈఎంఐ కట్టలేకపోవడం వల్ల తన తండ్రి ఆటోను ఫైనాన్స్ కంపెనీ సీజ్ చేసింది. ఆ వాహనాన్ని తిరిగిపొందడానికి సోనూసూద్ సాయం చేస్తాడన్న నమ్మకంతో ముంబయి వెళ్లాడు వెంకీ.

ఇవీ చూడండి: 'ఆదిత్య 369' సీక్వెల్​తో మోక్షజ్ఞ ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.