తన కార్యాలయాలపై నాలుగు రోజులపాటు విస్తృతంగా జరిగిన ఐటీ సోదాలపై ప్రముఖ నటుడు సోనూసూద్(Sonu Sood Latest News) మౌనం వీడారు. చరిత్రను చెప్పుకోవాల్సిన అవసరం లేదని.. కాలమే చెబుతుందని ట్వీట్ చేశారు. తాను దేశప్రజలకు సేవచేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నానని తెలిపారు.
-
“सख्त राहों में भी आसान सफर लगता है,
— sonu sood (@SonuSood) September 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” 💕 pic.twitter.com/0HRhnpf0sY
">“सख्त राहों में भी आसान सफर लगता है,
— sonu sood (@SonuSood) September 20, 2021
हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” 💕 pic.twitter.com/0HRhnpf0sY“सख्त राहों में भी आसान सफर लगता है,
— sonu sood (@SonuSood) September 20, 2021
हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” 💕 pic.twitter.com/0HRhnpf0sY
"దేశ ప్రజలకు సేవ చేసేందుకు ప్రతిజ్ఞ చేశాను. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి.. ప్రజల ప్రాణాలను రక్షించటం కోసం, పేదల కోసం ఎదురుచూస్తుంది. మానవతప్పిదాలకూ నష్టపోయిన వారికి అండగా ఉండాలని నేను అనేక మందిని ప్రోత్సాహించాను. కొంతమంది అతిథులు రావటం వల్ల నాలుగు రోజులుగా మీకు సేవ చేయలేకపోయాను. నేను ప్రచారకర్తగా వ్యవహరించినందుకు గానూ.. వచ్చే పారితోషికాన్ని మానవసేవ కోసం ఉపయోగించమని.. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయా బ్రాండ్ సంస్థలకు సూచించాను. మళ్లీ వినయంగా మీకు సేవ చేసేందుకు, జీవితాలను కాపాడేందుకు వచ్చాను. నా ప్రయాణం కొనసాగుతుంది. కష్టమైన దారుల్లోనూ సులభ ప్రయాణాన్ని కనుక్కోవచ్చు."
-- సోనూసూద్, ప్రముఖ నటుడు
నాలుగు రోజుల పాటు..
పన్ను ఎగవేత దర్యాప్తులో(Sonu Sood Income Tax) భాగంగా.. సోనూసూద్(Sonu Sood News) నివాసాలు, కార్యాలయాల్లో నాలుగు రోజులపాటు ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ముంబయి, లఖ్‌నవూలోని సోనూసూద్‌కు చెందిన ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. సోనూ.. రూ.20 కోట్లకుపైగా పన్ను ఎగవేశారని ఐటీ శాఖ వెల్లడించింది. కొవిడ్ మొదటి వేవ్ సమయంలో ఆయన సంస్థకు రూ.18 కోట్లకు పైగా విరాళాలు రాగా.. కేవలం రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేశారని అధికారులు పేర్కొన్నారు.
బ్రాండ్ అంబాసిడర్‌గా..
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది వలసకార్మికులు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు సోనూ(Sonu Sood News) సాయం చేశారు. అటు దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న 'దేశ్‌కే మెంటార్స్' కార్యక్రమానికి సోనూ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆయన ఇంట్లో సోదాలు జరగటం చర్చనీయాంశమైంది.
సోనూ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులను(Sonu Sood Income Tax) ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కొవిడ్ వేళ వలస కూలీలతో పాటు ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తిపై కుట్రపూరితంగా ఈ దాడులు చేశారని ఆరోపించాయి.
ఇవీ చదవండి:
Sonu Sood IT Raid:'సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేత'