ETV Bharat / sitara

'గర్ల్​ఫ్రెండ్​ను కలవాలి.. సాయం చేయవా!' - సోనూసూద్ సాయం

ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్న వలసకూలీలను ఇళ్లకు పంపడంలో తన వంతు కృషి చేస్తున్నారు నటుడు సోనూసూద్. ఇబ్బందుల్లో ఉన్నవారు సామాజిక మాధ్యమాలు, టోల్​ ఫ్రీ నెంబర్​ ద్వారా తెలియజేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ నుంచి విచిత్రమైన స్పందన ఎదురైంది. దానికి అదే రీతిలో సోనూ సమాధానమిచ్చారు.

Sonu Sood hilarious reply to fan
లాక్​డౌన్​లో గర్ల్​ఫ్రెండ్​ను కలవాలి.. సాయం చేయవా?
author img

By

Published : May 27, 2020, 6:42 AM IST

కరోనా ప్రభావంతో ఏర్పడిన పరిస్థితుల రీత్యా, ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలువురు వలస కూలీలు. వారిని ఇళ్లకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్. ఎలాంటి ఇబ్బంది ఉన్నా తనను సంప్రదించాలని కోరిన ఈ నటుడికి.. కొందరు నెటిజన్లు విపరీత కోరికలు అడుగుతున్నారు.

ఇటీవలే ఓ వ్యక్తి మద్యం కావాలని అడగ్గా.. తాజాగా ఓ వ్యక్తి, బిహార్​లో ఉన్న తన ప్రేయసి దగ్గరికి వెళ్లేందుకు సాయం చేయమని ట్విట్టర్​ వేదికగా విన్నవించాడు. దీనికి సోనూ ఫన్నీగా సమాధానమిచ్చారు. "కొన్ని రోజులు నీ ప్రేమకు దూరంగా ఉండటానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ నిజమైన ప్రేమకు ఇది పరీక్ష" అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది. సదరు నటుడి హాస్య చతురతను ప్రశంసిస్తున్నారు.

  • थोड़े दिन दूर रह के देख ले भाई .. सच्चे प्यार की परीक्षा भी हो जाएगी । 😂 https://t.co/mD7JEMgD3q

    — sonu sood (@SonuSood) May 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వలస కూలీల కోసం బస్సులు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా హెల్ప్​లైన్​ నంబర్​ను ప్రారంభించారు సోనూసూద్. వైద్యులకు పీపీఈ కిట్లు సరఫరా, తన హోటల్​లో వసతి ఏర్పాట్లు చేసి ఉదారత చాటుకున్నారు. పలు సినిమాల్లో ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన సోనూ, ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌ 'పృథ్వీరాజ్'లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: విలన్ కాదు అతడు రియల్​ హీరో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.