ETV Bharat / sitara

సోనూసూద్..  ఒలింపిక్స్​లో భారత్​ బ్రాండ్​ అంబాసిడర్​గా - సోనూ సూద్​ ఒలింపిక్స్​ బ్రాండ్​ అంబాసిడర్​

రష్యాలో వింటర్ ఒలింపిక్స్​ గేమ్స్​​లో భారత్​కు బ్రాండ్​ అంబాసిడర్​గా నటుడు సోనూసూద్ ఎంపికయ్యారు. ఈ గౌరవం తనకు దక్కడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

sonusudh
సోనూసూద్​
author img

By

Published : Aug 2, 2021, 8:21 PM IST

బాలీవుడ్​ నటుడు సోనూసూద్​కు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది రష్యాలో జరగబోయే స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్​ వింటర్​ గేమ్స్​​లో భారత్​కు బ్రాండ్​ అంబాసిడర్​గా ఎంపికయ్యారు. ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమని, స్పెషల్​ ఒలింపిక్స్​ భారత్​ బృందంతో చేరడం సంతోషంగా ఉందని సోనూసూద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మెగా ఈవెంట్​లో పాల్గొననున్న భారత అథ్లెట్లతో వర్చువల్​గా మాట్లాడారు. వారిని ప్రోత్సాహిస్తూ ముందస్తు అభినందనలు తెలిపారు.

రష్యాలోని కజాన్​ వేదికగా 2022 జనవరి 22 నుంచి స్పెషల్​ వింటర్​ ఒలింపిక్స్​ ప్రారంభం కానున్నాయి. ఈ మెగా ఈవెంట్లో భారత్​కు ప్రాతినిథ్యం వహించే అథ్లెట్ల బృందానికి సోనూ నాయకత్వం వహించనున్నారు. సోనూ ఎంపిక కావడంపై స్పెషల్​ ఒలింపిక్స్​ ఛైర్​పర్సన్​ డాక్టర్​ మల్లికా నడ్డా సంతోషం వ్యక్తం చేశారు.

సోనూసూద్.. గతేడాది లాక్​డౌన్ విధించినప్పటి నుంచి ఎన్నో వేలమంది ప్రజలకు అండగా నిలిచారు. తనవంతుగా ఇంకా సాయం చేస్తూ నే ఉన్నారు. మరోవైపు తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.​

ఇదీ చూడండి: సోనూసూద్ ట్రస్ట్.. కరోనా బాధితుల పాలిట సంజీవిని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.