ETV Bharat / sitara

సోనూసూద్ ఇంటర్వ్యూ: 'రాజకీయ ప్రయోజనాల కోసం చేయట్లేదు'

author img

By

Published : Jul 27, 2020, 6:31 PM IST

Updated : Jul 27, 2020, 10:24 PM IST

లాక్​డౌన్ కాలంలో అవసరమైన వారికి సాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు నటుడు సోనూసూద్. వలస కూలీలను వారి సొంత గ్రామాలకు చేర్చడం, వారికి పని కల్పించడం, ప్రతిభను ప్రోత్సహించడం వంటి పనులు చేస్తూ నెట్టింట హీరోగా వెలుగొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోనూతో ఈటీవీ భారత్ ముచ్చటించగా పలు విషయాలు పంచుకున్నారు.

ఈటీవీ భారత్​తో సోనూసూద్ ముచ్చట్లు
ఈటీవీ భారత్​తో సోనూసూద్ ముచ్చట్లు
ఈటీవీ భారత్​తో సోనూసూద్ ముచ్చట్లు
పలుచోట్ల చిక్కుకుపోయిన వలసకూలీల కోసం బాలీవుడ్​ నటుడు సోనూసూద్​ ఎంతో కృషి చేస్తున్నారు. బస్సులు, విమానాలు, ప్రైవేట్​ వావానాల్లో వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని భారత్​కు తీసుకొచ్చేందుకు విమానాలు ఏర్పాటు చేస్తున్నారు. నెట్టింట కష్టాలకు చలించి వారికి అండగా నిలుస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్​లోని ఓ కుటుంబ కష్టం చూసి ఏకంగా ట్రాక్టర్ సాయంగా అందించారు. ఇవన్నీ చూస్తోన్న అభిమానులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోనూతో ఈటీవీ భారత్ ముచ్చటించగా పలు విషయాలను పంచుకున్నారు.

"వేల మంది ప్రజల ప్రార్థనల వల్లే నేను ఇంత గొప్పగా సేవ చేయగలుగుతున్నా. పంజాబ్​కు చెందిన తన తల్లిదండ్రులను చూసే నేను సేవ చేయడం నేర్చుకున్నా. వారు అక్కడ భక్తులకు, ఆకలితో ఉన్న వారికి భోజనం కల్పిస్తారు. అదే నేను ఈ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయడానికి కారణమైంది. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నాడని అంటున్నారు. కానీ నేను వారికి ఒక్కటే చెబుతున్నా. మీరు కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగమవ్వండి. మీకు తోచినంత సాయం చేయండి" అంటూ చెప్పుకొచ్చారు సోనూసూద్.

Last Updated : Jul 27, 2020, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.