ETV Bharat / sitara

'సోనూసూద్​ లాంటి వ్యక్తులు చాలా అరుదు'

ముంబయిలో చిక్కుకుపోయిన ఓ ప్రముఖ నటుడిని, త్వరలో తన స్వస్థలానికి చేర్చుతానని హామీ ఇచ్చారు సోనూసూద్. ఇప్పటికే ఎంతో వలసకూలీలను పలు వాహనాల ద్వారా ఇళ్లకు చేర్చి, వారి మనసుల్ని గెల్చుకున్నారు.

'సోనూసూద్​ లాంటి వ్యక్తులు చాలా అరుదు'
సోనూసూద్-నటుడు సురేంద్ర రాజన్
author img

By

Published : Jun 14, 2020, 7:49 AM IST

వలసకూలీల పాలిట దేవుడిలా మారిన సోనూసూద్.. ఇప్పుడు బాలీవుడ్ నటుడు సురేంద్ర రాజన్​కు అండగా నిలిచారు. గత మూడు నెలల నుంచి ముంబయిలో చిక్కుకుపోయిన ఇతడ్ని.. తన సొంత ఊరు సత్నాకు జూన్ 18లోపు పంపిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయమై స్పందించిన సురేంద్ర.. సోనూసూద్ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని ప్రశంసించారు.

"సోనూసూద్ చేస్తున్న పని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇలా ఎవరైనా చేయగలరా? అనిపించింది. అతడు అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఇలాంటి వారు ఉండటం చాలా అరుదు. ఈ మూడు నెలల్లో నాకు అయిన రూ.45000 ఖర్చును నా శిష్యుల్లో ఒకరు భరించారు. ఆర్ఎస్​ఎస్ వాళ్లు రేషన్ అందించారు" -సురేంద్ర రాజన్, బాలీవుడ్​ నటుడు

సురేంద్ర.. బాలీవుడ్​లో మున్నాభాయ్ ఎంబీబీఎస్, గుమ్నామి, ద లెజెండ్స్ ఆఫ్ భగత్ సింగ్ తదితర చిత్రాల్లో నటించారు. మార్చిలో ఓ వెబ్​సిరీస్​ కోసం ముంబయి వచ్చారు. అదే సమయంలో లాక్​డౌన్ విధించడం వల్ల అక్కడే చిక్కుకుపోయారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.