ETV Bharat / sitara

వారి చిరునవ్వే అతిపెద్ద అవార్డు.. 'ఈనాడు'తో సోనూసూద్ - సోనుసూద్​ ఐరాస అవార్డు

లాక్​డౌన్​లో వలసకార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా ఎందరినో ఆదుకుని.. రియల్​ హీరోగా నిలిచారు నటుడు సోనూసూద్​. ఈ నేపథ్యంలోనే ఐరాస ఆయన సేవలు గుర్తించి.. ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూ అంతరంగం మీ కోసం.

sonu sood
సోనూసూద్​
author img

By

Published : Oct 4, 2020, 6:23 AM IST

"కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్నప్పుడు వారి ముఖంపై విరిసే చిరునవ్వే నాకు అతి పెద్ద అభినందన" అంటున్నారు నటుడు సోనూసూద్‌. లాక్‌డౌన్‌ కాలంలో సాయానికి మారుపేరుగా మారిన ఆయన వలస కార్మికులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా ఎంతో మందిని ఆదుకున్నారు. సోనూ సేవలు గుర్తించిన ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ(యూఎన్‌డీపీ).. ప్రతిష్ఠాత్మక 'సస్టెయిన్‌బుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్‌' పురస్కారంతో సత్కరించింది. ఈ నేపథ్యంలో తనకు ఇలా సేవ చేయాలని ఎందుకు అనిపించింది? ఎలా చేస్తున్నారు? కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లభిస్తోంది? తదితర విషయాలను ఆయన 'ఈనాడు'తో పంచుకున్నారు. ఆ విశేషాలు..

యూఎన్‌డీపీ పురస్కారం రావడంపై మీ అనుభూతి ఏమిటి? ఇలాంటి గుర్తింపు, అవార్డులు వస్తాయని ముందే ఊహించారా..

కష్టాల్లో ఉన్న వారిని నాకు ఉన్నంతలో ఆదుకోవాలని ప్రయత్నిస్తున్నా. దీన్ని గుర్తించి పురస్కారమివ్వడం చాలా సంతోషంగా అనిపించింది. తొలుత నేను ఇలాంటివేమీ ఆశించలేదు. బాధల్లో ఉన్న వారిని ఆదుకోవడం పౌరుడిగా నా బాధ్యతగా భావించా. దేశంలో ఎంతో మంది చిన్నచిన్న సమస్యలతో బాధపడుతున్నారు. వాటిని తీర్చినప్పుడు.. వారి ముఖంలో దరహాసం కనిపిస్తుంది. అంతకంటే పెద్ద అవార్డు, అభినందన నాకేముంటుంది చెప్పండి.

sonu sood
సోనూసూద్​

ఇలా సమాజసేవ చేయడానికి మీకు స్ఫూర్తి ఎవరు?

మా నాన్న శక్తిసాగర్‌సూద్‌, మా అమ్మ సరోజ్‌ సూద్‌లే నాకు స్ఫూర్తి. మాది పంజాబ్‌ రాష్ట్రంలోని మోగ. అక్కడ అమ్మానాన్నలు చాలా కాలం నుంచి తమకు ఉన్నంతలో ఎదుటి వారిని ఆదుకొనేవారు. వస్త్ర, అన్నదానాలు చేసేవారు. అదే నాకు అలవాటైంది. అక్టోబరు 13న అమ్మ వర్ధంతి. అమ్మ జ్ఞాపకార్థం ఏటా నేను అక్కడ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా. ఈసారి హైదరాబాద్‌లోనే ఉంటానేమో! అయినా అక్కడ ప్రతి సంవత్సరం లాగే కార్యక్రమాలు కొనసాగుతాయి.

పూర్తి ఖర్చులు భరించి విద్యార్థులను చదివిస్తా అన్నారు. ఆ ఎంపిక ప్రక్రియ ఎంత వరకు వచ్చింది?

ఏ సాయం చేసినా దానివల్ల ఒకరికే మేలు జరుగుతుంది. అదే చదువుకోవడానికి సాయం చేస్తే అది ఒక కుటుంబానికి, ఒక తరానికి ఉపయోగపడుతుంది. అందుకే అర్హులైన పేద విద్యార్థులను చదివించాలనుకున్నా. అలాంటి విద్యార్థులను మా బృందాలు గుర్తిస్తున్నాయి. ఈ నెలలో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. వీరందరికీ ఫీజులు, భోజనం, వసతి, పుస్తకాలు, దుస్తులు... ఇలా అన్ని ఖర్చులూ ఇచ్చి చదివిస్తా.

sonu sood
సోనూసూద్​

నిరుద్యోగుల కోసం ఒక యాప్‌ రూపొందించారు కదా? అది ఎలా సేవలందిస్తుంది?

'ప్రవాసీ రోజ్‌గార్‌' అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం అది. అందులో వివరాలిస్తే చాలు.. మా బృంద సభ్యులు వారికి ఫోన్‌ చేస్తారు. వారి విద్యార్హతలు, సామర్థ్యాలను తెలుసుకొని తగిన ఉపాధి దొరికేందుకు సాయపడతారు.

ఇంతమందికి సాయం చేస్తున్నారుగా..! మీకెవరైనా చేయూత అందించారా?

నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఎంతోమంది సాయం చేయడం వల్లే అని నమ్ముతా. ప్రస్తుతం తలపెట్టిన సేవా కార్యక్రమాలకు ఎంతోమంది సాంకేతికంగా, ఆర్థికంగా సాయపడుతున్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు.

మీ కుటుంబం నుంచి ఎలాంటి సహకారం అందుతోంది?

నా భార్య సొనాలి. నాకు ఇద్దరు అబ్బాయిలు. వారి వల్లే నేనివన్నీ చేయగలుగుతున్నా. వారి సాయం లేకుండా అడుగు కూడా వేయలేను కదా!

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఏ పార్టీ నుంచైనా ఆహ్వానం అందిందా?

నేను నిస్వార్థంగా ఈ సేవ చేస్తున్నా. ఏదీ ఆశించలేదు. కొన్ని పార్టీల నుంచి నేతలు నన్ను ఆహ్వానించారు. నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. దేవుడు శక్తినిచ్చినంత వరకూ ఇలా సేవ చేసుకుంటూ పోతా. మీ అందరి అభిమానం, పెద్దల ఆశీర్వాదాలు నన్ను నడిపిస్తున్నాయి.

యువతకు మీరిచ్చే సందేశం?

ప్రతి ఒక్కరిలో ఎన్నో ప్రతిభలు, శక్తులుంటాయి. వాటిని గుర్తించాలి. పదును పెట్టాలి. ఆ దిశగా అడుగువేయాలి. తర్వాత అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎంత ఎదిగినా ఎక్కడున్నా తోటి మనిషికి సాయం చేయాలన్న తలంపును ఎప్పుడూ మరువొద్దు.

sonu sood
సోనూసూద్​

వలస కార్మికులను సొంత ఊళ్లకు పంపాలనే ఆలోచన ఎలా వచ్చింది?

కరోనా మహమ్మారి దేశాన్ని వణికించింది. పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడ్డాయి. చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఉండటానికి నివాసం లేక, తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలన్నీ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చాయి. మనసుకు కష్టంగా అనిపించింది. వాళ్లను ఎలాగైనా ఆదుకోవాలని నిర్ణయించుకున్నా. కొంతమంది స్నేహితుల సాయంతో ముందు స్థానికంగా కొన్ని హోటళ్లలో వలస కార్మికులకు వసతి కల్పించా. భోజన ఏర్పాట్లు చేశా. ఇలా భోజనం పెట్టేటప్పుడు ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చింది. 'సార్‌ మాకు 10 రోజులకు సరిపడా భోజనం ఇస్తారా' అని అడిగింది. ఎందుకన్నాను? మేము కర్ణాటక వెళ్లాలి అన్నారు. ఎలా వెళ్తారు? అంటే.. 'నడుచుకుంటూ' అని చెప్పారు. ముంబయి నుంచి వందల కిలోమీటర్లు ఎలా నడుచుకుంటూ వెళ్తారా? అని ప్రశ్నించా. పైగా వారి చేతుల్లో చిన్నపిల్లలున్నారు. చాలా బాధేసింది. సొంత ఊరికి చేరుకోవాలని ఇలా ఎంతో మంది ఎంతగా తపిస్తున్నారో అర్థమైంది. వారిని రెండురోజులు సమయం అడిగా. అప్పుడు దానికి తగ్గ ఏర్పాట్లు చేశా. బస్సులు, రైళ్లను సొంత ఖర్చులతో తిప్పా. చాలా మంది వాళ్ల గ్రామాలకు చేరుకున్నారు.

ఆ సమయంలో వారి కళ్లలో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. తర్వాత విదేశాల్లో ఉన్న విద్యార్థులను సైతం వారి ఇళ్లకు చేర్చడానికి విమాన ప్రయాణ ఏర్పాట్లు చేశా. తల్లిదండ్రులు, పిల్లలు ఎంతో సంతోషించారు. కెనడా, రష్యా, ఫిలిప్పీన్స్‌... తదితర దేశాల నుంచి చాలా వినతులు వచ్చాయి. నాకు సాధ్యమైనంత వరకూ వారికి సాయం చేశా.

ప్రతినాయకుడిగా మీరు మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం మిమ్మల్ని అందరూ రియల్‌ హీరో అంటున్నారు. మరి ఇప్పుడు కథానాయకుడి పాత్రలేమైనా వచ్చాయా?

చాలామంది పాజిటివ్‌ పాత్రలే నాకు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. తెలుగులో చేస్తున్న 'అల్లుడు అదుర్స్‌' చిత్రంలోనూ తొలుత నాది వ్యతిరేక ఛాయలున్న పాత్ర. ప్రస్తుతం దాన్ని మంచి పాత్రగా మార్చారు. బాలీవుడ్‌లో ఆదిత్యచోప్రా నిర్మిస్తున్న 'పృథ్వీరాజ్‌' అనే చారిత్రక నేపథ్యమున్న చిత్రంలో నటిస్తున్నా. అక్షయ్‌కుమార్‌ ఇందులో కథానాయకుడు. మరో రెండు ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకున్నా. మొత్తానికి అందరూ నాకు ఇప్పుడు మంచి పాత్రలే ఇవ్వాలని చూస్తున్నారు.

వలసకార్మికులు, రైతులు, విద్యార్థులు.. ఇలా అందర్నీ ఆదుకుంటున్నారు. వీటన్నింటికీ మీకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

ముందు నుంచీ మా కుటుంబానికేమీ లోటు లేదు. మాకు వ్యాపారాలున్నాయి. నేను మోడలింగ్‌, సినిమాలు చేసి సంపాదించాను. వాటితో ముందుగా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాను. తర్వాత మంచి మనసున్న చాలామంది చేతులు కలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.