ETV Bharat / sitara

న్యాయవిద్యార్థిని శస్త్రచికిత్సకు సోనూ సాయం

న్యాయవిద్యార్థిని శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం చేసి మంచిమనసు చాటుకున్నారు నటుడు సోనూసూద్. లాక్​డౌన్​లో ప్రభావంతో చిక్కుకుపోయిన చాలామంది వలస కూలీలను స్వస్థలాకు చేర్చి, వాళ్లతో పాటు ప్రజల మనసుల్లో చోటు సంపాదించారు.

Sonu Sood
సోనూసూద్
author img

By

Published : Aug 14, 2020, 1:58 PM IST

కష్టం అనే మాట వినిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఇప్పుడు మరోసారి దాతృత్వం చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి, ఆరు నెలలుగా మోకాళ్ల సమస్యతో బాధపడుతున్న 22 ఏళ్ల యువతికి.. శ్రస్త్రచికిత్స చేయించి ఆదుకున్నారు.

అయినా వాళ్లు అండగా లేకపోయినా..

ఉత్తరప్రదేశ్​కు చెందిన ప్రజ్ఞ న్యాయవిద్యను అభ్యసిస్తుంది. ఆరు నెలల క్రితం ఓ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో తన రెండు మోకాళ్లు చితికిపోయాయి. స్థానిక వైద్యులు శస్త్రచికిత్స చేయాలని.. అందుకు రూ.1.5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆర్థిక స్థోమతలేని ఈ యువతికి బంధువులు కూడా చేయూతగా నిలవలేకపోయారు. దీంతో ఆమె అప్పటినుంచి చక్రాల కుర్చీకే పరిమితమైంది. సోనూ గురించి తెలుసుకున్న ఆమె.. ఆగస్టు తొలి వారంలో ట్విట్టర్​ ద్వారా తనకు సాయం చేయాలని కోరింది.

  • Have spoken to the doctor.

    Have lined up your travel too.

    Ur surgery will happen next week.

    Get well soon ❣️

    God bless.🙏 https://t.co/2aQSpXgsrl

    — sonu sood (@SonuSood) August 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

స్పందించిన సోనూ.. ప్రజ్ఞను తన సొంత డబ్బులతో దిల్లీకి రప్పించి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించి అండగా నిలిచారు. తనకు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని, సోనూకు జీవితకాలం రుణపడి ఉంటానని ప్రజ్ఞ భావోద్వేగానికి గురైంది.

లాక్​డౌన్​తో పలుచోట్ల చిక్కుకుపోయిన వేలమంది వలస కూలీలను తమ స్వస్థలాలకు ప్రత్యేక బస్సులు ద్వారా చేరవేస్తున్నారు సోనూ.

ఇది చూడండి మాఫియా కనుసన్నల్లో బాలీవుడ్​: కంగనా రనౌత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.