కరోనా మహమ్మారితో నెలకొన్న ప్రస్తుత కష్టకాలంలో అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ హీరో అయ్యారు నటుడు సోనూసూద్. తాజాగా ఆయన నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ట్వీట్లు చేశారు.
"దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. కొవిడ్-19 విపత్కర కాలంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టకూడదు. జేఈఈ, నీట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చాలా దూరం నుంచి వస్తుంటారు. బిహార్‌లో కొన్ని జిల్లాలు వరదలతో ప్రభావితమయ్యాయి. మరికొన్ని చోట్ల లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. పరీక్షలు ముఖ్యమైనవే. కానీ విద్యార్థులను రక్షించుకోవడం అంతే ముఖ్యం. ప్రపంచం మొత్తం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. పరీక్షలు కూడా వాయిదా వేయాలి" అని ప్రస్తుత పరిస్థితులను వివరించారు సోనూ.
దేశవ్యాప్తంగా నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ డిమాండ్‌లు వినిపిస్తున్నా.. పరీక్షలు యథావిధిగా జరుగుతాయంటూ మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సర్క్యులర్ జారీ చేసింది.
విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు..
లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలు, విద్యార్థులను ప్రత్యేక బస్సులు, రైళ్లు, విమానం సాయంతో వారి స్వస్థలాలు చేర్చారు సోనూ. పేదలకు అండగా నిలుస్తున్నారు. అయితే తాజాగా హరియాణాలోని పంచ్‌కులా జిల్లా మోర్నీ గ్రామంలోని పలువురు విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందించి ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేలా సాయం చేసి మరోసారి దాతృత్వం చాటారు.
-
Students of Govt school Morni were in for a surprise when they got a call from Actor Sonu Sood, his friend Karan Gilhotra this mrng who announced that thy need not travel miles for phones as they handedover new smart phones to their Principal@iepunjab @SonuSood @Karan_Gilhotra pic.twitter.com/2jQgnQT94E
— Hina Rohtaki (@HinaRohtaki) August 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Students of Govt school Morni were in for a surprise when they got a call from Actor Sonu Sood, his friend Karan Gilhotra this mrng who announced that thy need not travel miles for phones as they handedover new smart phones to their Principal@iepunjab @SonuSood @Karan_Gilhotra pic.twitter.com/2jQgnQT94E
— Hina Rohtaki (@HinaRohtaki) August 25, 2020Students of Govt school Morni were in for a surprise when they got a call from Actor Sonu Sood, his friend Karan Gilhotra this mrng who announced that thy need not travel miles for phones as they handedover new smart phones to their Principal@iepunjab @SonuSood @Karan_Gilhotra pic.twitter.com/2jQgnQT94E
— Hina Rohtaki (@HinaRohtaki) August 25, 2020
ఆ గ్రామంలో లాక్‌డౌన్ కారణంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొన్ని కుటుంబాలు.. తమ పిల్లల చదువులకు స్మార్ట్ ఫోన్లు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ విషయం అక్కడ జర్నలిస్ట్ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అది కాస్తా సోనూసూద్ కంటపడింది. కేవలం ఒక్క రోజులోనే సోనూ స్మార్ట్ ఫోన్లు సిద్ధం చేసి.. విద్యార్థులకు పంపిణీ చేశారు. దీంతో ఆయనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఇది చూడండి 'ఈటీవీ'కి మహేశ్ రజతోత్సవ శుభాకాంక్షలు