కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్డౌన్ కారణంగా నెలరోజులుగా ముంబయిలో ఉన్న బాలీవుడ్ నటి సోనమ్ కపూర్.. తాజాగా లండన్‌కు వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించి విమానం నుంచి తీసిన ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంటూ.. 'లండన్ ఐ యామ్ బ్యాక్.. సో బ్యూటిఫుల్' అని రాసుకొచ్చింది.
మార్చిలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించకముందే భర్త ఆనంద్ అహుజాతో కలిసి సోనమ్ దిల్లీ చేరుకుంది. అనంతరం జూన్ 9న సోనమ్ పుట్టిన రోజుకు ఒకరోజు ముందు ఈ దంపతులు ముంబయికి వచ్చారు. అదే సమయంలో లాక్‌డౌన్‌తో పాటు అన్ని ప్రయాణాలపై నిషేధంతో నగరంలోనే ఉండాల్సి వచ్చింది. సొంత ఇళ్లు, బంధువులు అక్కడే ఉండటం వల్ల ఇంగ్లీష్ నగరానికే వెళ్లిపోయింది సోనమ్
సోనమ్ చివరగా 2019లో వచ్చిన 'ది జోయా ఫ్యాక్టర్' చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన నటించింది.
ఇదీ చూడండి: 'సుశాంత్ చెప్పలేనంత వేదన మిగిల్చాడు'