ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో ఆన్‌లైన్ వేధింపులు ఒకటి. వ్యక్తుల ఫొటోలను అశ్లీలంగా మార్చడం, అసభ్య కామెంట్లు పెట్టడం, బెదిరింపులు, వేధింపులు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ వేధింపులకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందంటున్నారు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. ఆన్‌లైన్ వేధింపులను నివారించడం కోసం ఆమె మహారాష్ట్ర పోలీసులతో చేతులు కలిపారు. 'మిషన్ జోష్' పేరుతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సోనాక్షి ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఆన్‌లైన్ వేధింపులను అంతం చేసేందుకు 'మిషన్ జోష్' పేరుతో ప్రచార కార్యక్రమం ప్రారంభించాం. ఇందుకోసం స్పెషల్ ఐజీపీ ప్రతాప్ దిఘవ్‌కర్‌తో చేతులు కలిపాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆన్‌లైన్ వేధింపులపై అవగాహన కల్పించబోతున్నాం. ఆన్‌లైన్ వేధింపులు బాధితుల మానసిక స్థితిపై ఎలా ప్రభావం చూపుతాయో తెలియజేస్తాం. ఇక చాలు. ఆన్‌లైన్ వేధింపులు ఉండకూడదు"’ అంటూ సోనాక్షి తన పోస్టుకు కాప్షన్ ఇచ్చారు.