బాలీవుడ్ నటుడు శత్రఘ్న సిన్హా భాజపాను వదిలి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకోవడంపై చాలా విమర్శలు వచ్చాయి. ఆయన కుమార్తె, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఈ విమర్శలను తోసిపుచ్చింది.
'పార్టీ మారడం అనేది నా తండ్రి నిర్ణయం. ఎక్కడైనా ఆనందంగా ఉండలేకపోయినపుడు మార్పు కోరుకుంటాం. అదే ఆయన చేశారు. కొత్తగా జట్టుకట్టిన కాంగ్రెస్తో కలిసి మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నా'.
-- బాలీవుడ్ నటి, సోనాక్షి సిన్హా