ETV Bharat / sitara

'ఈ సినిమా వల్ల నా పెళ్లి రెండేళ్లు వాయిదా' - సోలో బ్రతుకే సో బెటర్​ సాయి తేజ్​ ఇంటర్వాయూ

'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా వల్ల తన పెళ్లి రెండేళ్ల పాటు వాయిదా పడిందని చెప్పారు హీరో సాయితేజ్​. ఈ సినిమాలోని క్యారెక్టర్​ తన రియల్​లైఫ్​ క్యారెక్టర్​ ఒకటేనని చెప్పారు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం థియేటర్​లో విడుదల కానుంది.

sai tej interview
సాయితేజ్
author img

By

Published : Dec 22, 2020, 9:14 PM IST

సాయితేజ్

హీరో సాయితేజ్, నభా నటాషా జంటగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం థియేటర్​లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా కథానాయకుడు సాయితేజ్​తో పాటు హాస్యనటులు సత్య, వెన్నెల కిషోర్​ను.. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేశారు. వీరి మధ్య సాగిన సరదా సరదా సంభాషణలలో.. హీరో సాయితేజ్​ ఓ ఆసక్తికర విషయం చెప్పారు. ఈ చిత్రం వల్ల తన పెళ్లి రెండేళ్ల పాటు వాయిదా పడిందని అన్నారు.

"సరైన సమయంలో సినిమా చేశాను. మా ఇంట్లో ఎవరైనా నా పెళ్లి గురించి అడిగితే సోలో బ్రతుకే సో బెటర్​ అని చెప్పేంత ధైర్యం ఉంటుంది. మా అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని, నేనేమో చేసుకోనని.. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ సినిమా నా దగ్గరకు వచ్చింది. అచ్చం నా క్యారెక్టర్​యే చేసే అవకాశం వచ్చింది. అందుకే ఈ సినిమాలో చాలా సులభంగా నటించగలిగా. మొత్తంగా ఈ సినిమా వల్ల నాకు ఓ లాభం జరిగింది. నా పెళ్లి రెండేళ్ల పాటు వాయిదా పడింది (నవ్వుతూ)."

- సాయితేజ్​, కథానాయకుడు

దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు సాయితేజ్​. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. అందులో ఒక యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపించనున్నారు. దీంతో పాటు సుకుమార్‌ రైటింగ్స్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ కలిసి నిర్మిస్తున్న ఓ సినిమాలో కూడా సాయి నటించనున్నారు. 1970, 80 నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఇదీచూడండి : 'థియేటర్​ నుంచి నవ్వుకుంటూ బయటికొస్తారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.