ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది. శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో ఓ పాటకు నృత్య రీతులు సమకూర్చుతున్నారు. ఇందులో సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి కనిపించారు. హీరోహీరోయిన్ల వ్యక్తిగత సిబ్బంది పీపీఈ కిట్లలో దర్శనమిచ్చారు.
ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా పూర్తి జాగ్రత్తలతో షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఔట్‌డోర్ కంటే స్టూడియోల్లోనే చిత్రీకరణ జరిపేందుకు పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">