హీరోయిన్ ఆలియాభట్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా 'గంగూబాయ్ కతియావాడి'. హుస్సేన్ జైదీ రచించిన 'మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబయి'లోని 'మేడమ్ ఆఫ్ కామతిపుర' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కామతిపుర నివాసుల నుంచి అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉంది. కామతిపుర దేశంలోనే రెండో రెడ్ లైట్ ఏరియాగా పేరు గాంచింది!.
ఇటీవల ఫిబ్రవరి 24వ తేదీన ఈ చిత్ర టీజర్ విడుదలైంది. దీంతో మరోసారి కామతిపుర నివాసులు.. సినిమాపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. తమ ప్రాంతానికి ఉన్న 200ఏళ్ల వాస్తవ చరిత్రను ఈ సినిమా ద్వారా కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ చిత్రం.. వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తుందని వాపోయారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కామతిపుర(రెడ్ లైట్ ఏరియా)కు ఉన్న పేరు ఇప్పుడిప్పుడే తొలిగిపోతుందని.. కానీ ఇప్పుడీ సినిమా ద్వారా మళ్లీ వెలుగులోకి వస్తుందని అన్నారు. దీనివల్ల ప్రస్తుత, భవిష్యత్ తరాలపై ప్రభావం పడే అవకాశముందని వెల్లడించారు. ఈ సినిమాను నిలిపివేయాలంటూ నిరసనలు తెలపడానికి ఆ ప్రాంత నివాసులు సిద్ధమవుతున్నారని తెలిసింది.
ఎవరీ గంగూబాయి..?
హుస్సేన్ రాసిన పుస్తకం ప్రకారం 1960ల్లో గంగూబాయి తన ప్రేమికుడితో గుజరాత్ నుంచి పారిపోయి ముంబయికి చేరుకుంది. మోసం చేసిన ప్రియుడు ఆమెను వ్యభిచార గృహాలకు అమ్మేశాడు.అనంతరం తానే కొన్ని వ్యభిచార గృహాలను నడిపేది. అలా ఆమె ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’గా పిలువబడింది. అప్పట్లో ఉన్న బడా ముంబయిడాన్‌లతో ఆమెకు పరిచయాలుండేవి. తర్వాత కాలంలో సెక్స్‌వర్కర్ల హక్కుల కోసం పోరాడింది. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చూపింది.
ఇదీ చూడండి: 'గంగూబాయ్..' చిత్రాన్ని నిలిపి వేయాలంటూ పిటిషన్