ETV Bharat / sitara

'గంగూబాయ్..' చిత్రాన్ని నిలిపి వేయాలంటూ పిటిషన్ - sanjay leela bhansali latest news

బాలీవుడ్ స్టార్​ హీరోయిన్​ ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్​లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న చిత్రం 'గంగూబాయ్ కతియావాడి'. ఈ సినిమా ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్ర నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలైంది.

SLB, Alia Bhatt's Gangubai Kathiawadi entangled in legal trouble
న్యాయపరమైన చిక్కుల్లో 'భన్సాలీ' కొత్త చిత్రం
author img

By

Published : Dec 25, 2020, 7:55 PM IST

బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ కొత్త చిత్రం 'గంగుబాయ్​ కతియావాడి'కి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ సినిమా నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ గంగూబాయ్​ కుమారుడు బాబూజీ రావ్​జీ షా.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిత్ర దర్శకుడు భన్సాలీ సహా హీరోయిన్​ ఆలియా భట్​, రచయిత హుస్సేన్​ జైదీ, పాత్రికేయుడు జేన్​ బోర్గెస్​లపై ఈ నెల 20న ఆయన కేసు పెట్టారు.

అసలేంటి ఈ వివాదం..

పాత్రికేయుడు జేన్​ బోర్గెస్​ సహకారంతో హుస్సేన్​ జైదీ రాసిన 'ది మాఫియా క్వీన్స్​ ఆఫ్​ ముంబయి' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను భన్సాలీ రూపొందిస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో చిన్నవయసులోనే వేశ్యగా మారిన గంగూబాయి.. తర్వాత ముంబయి మాఫియా క్వీన్​గా ఎలా ఎదిగిందో ఈ పుస్తకంలో రచయిత వివరించారు. అయితే.. ఈ పుస్తకం తమకు పరువునష్టం కలిగిస్తోందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు బాబూజీ. తమ గోప్యత, ఆత్మగౌరవం, స్వేచ్ఛలకు భంగం కలిగించేలా ఉందని తన పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని గంగూబాయి అధ్యాయాల్ని తొలగించాలని, భన్సాలీ సినిమాను నిలిపివేయాలని పిటిషన్​లో కోరారు. ఈ అభ్యర్థనపై డిసెంబర్​ 22న బొంబాయి సివిల్​ కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై జనవరి 7లోపు వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు గడువునిచ్చింది.

SLB, Alia Bhatt's Gangubai Kathiawadi entangled in legal trouble
'గంగూబాయ్ కతియావాడి'లో ఆలియా భట్​, గంగూబాయ్​ (పాత చిత్రం)

అయితే.. భన్సాలీ చిత్రాలు సమస్యల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. అంతకు మందు ఆయన తీసిన పద్మావత్​ను నిలిపివేయాలని పెద్దఎత్తున నిరసనలు వినిపించాయి. హరియాణా, రాజస్థాన్​, గుజరాత్​, మధ్యప్రదేశ్​లలో ఈ సినిమా విడుదల కాలేదు.

ఇదీ చూడండి:నెట్​ఫ్లిక్స్​ కోసం భన్సాలీ కొత్త ప్రాజెక్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.