ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో రెండు రోజుల నుంచి బాధపడుతున్న ఆయన్ని కుటుంబసభ్యులు సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి సిరివెన్నెలకు కిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కొన్ని రోజుల నుంచి సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడతున్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే అస్వస్థతకు గురికావడం వల్ల హుటాహుటిన కుటుంబసభ్యులు సిరివెన్నెలను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు వెల్లడించారు.