సందీప్ కిషన్ కథానాయకుడిగా హాకీ నేపథ్యంలో 'ఏ1 ఎక్స్‌ప్రెస్' అనే చిత్రం తెరకెక్కుతోంది. డెనిస్ జీవన్ కనులొలను దర్శకుడు. లావణ్య త్రిపాఠి నాయిక. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఇందులోని 'సింగిల్ కింగులం' అనే గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. తమిళంలో మంచి హిట్టయిన 'సింగిల్ పసంగే' అనే పాటకు ఇది తెలుగు రూపం. ఈ వీడియోను రొటీన్‌కు భిన్నంగా సరికొత్త పంథాలో రూపొందించారు.
సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్.. వంటి వాటితో చేసిన ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. ప్రేయసి లేకుండా ఒంటరిగా ఉండేవాళ్ల మనోభావాలు సాహిత్యంతో చెప్పే ప్రయత్నం చేశాడు సామ్రాట్. హిప్‌హాప్ తమిజా స్వరాలు సమకూర్చగా రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">