తన హృదయం ముక్కలైందని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ కంపోజర్‌గా వరుస హిట్ ఆల్బమ్స్‌తో మెప్పిస్తున్న ఆయన తాజాగా ఆన్‌లైన్‌లో ఓ వీడియో చూసి భావోద్వేగానికి లోనయ్యారు.
ఏంటా వీడియో?
తమిళనాడుకు చెందిన ఓ నెటిజన్.. రోడ్డు పక్కన ఆకలితో ఉన్న వృద్ధురాలికి ఆహారం, మంచి నీళ్లు అందించాడు. తన ఆకలి తీరుస్తున్నందుకు ఆ వృద్ధురాలు ఎంతో ఆనందించింది. వెంటనే తన వద్ద ఉన్న కొంత మొత్తాన్ని ఆ వ్యక్తికి అందించబోయింది. అతను వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వృద్ధురాలి కళ్లలో ఉన్న ఆనందం, చిరునవ్వు ప్రతి ఒక్కరి హృదయాల్ని ద్రవింపచేస్తోంది.
తాజాగా ఈ వీడియో చూసిన తమన్.. ట్విటర్ వేదికగా ఓ సంతోషకరమైన విషయాన్ని తెలియచేశారు. తాను ఓ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు. "ఈ వీడియో చూసి నా హృదయం ముక్కలయ్యింది. ఓ వృద్ధాశ్రమాన్ని నిర్మించాలనే ఆలోచన నాలో మొదలైంది. నా కోరికకు త్వరలోనే కార్యరూపం ఇస్తాను. దానికి తగిన ధైర్యాన్ని, స్థిరత్వాన్ని దేవుడు నాకు అందిస్తాడని ఆశిస్తున్నాను. కన్నీళ్లతో ఈ మెస్సేజ్ పెడుతున్నాను. మీరు కూడా దయచేసి ఆహారాన్ని వృథా చేయకండి. అవసరమైన వారికి దానిని అందించండి" అని కోరారు.
-
My heart jus broke into pieces
— thaman S (@MusicThaman) April 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
A new dream started in me to build a old age home 🏡 will make it soon I wish god gives me the strength and support to make it ...
I was typing this with tears rolling
Don’t waste food
Serve food for the needy
🥺
Let’s be HUMANS ✊♥️ https://t.co/gxHSF1ML2w
">My heart jus broke into pieces
— thaman S (@MusicThaman) April 25, 2021
A new dream started in me to build a old age home 🏡 will make it soon I wish god gives me the strength and support to make it ...
I was typing this with tears rolling
Don’t waste food
Serve food for the needy
🥺
Let’s be HUMANS ✊♥️ https://t.co/gxHSF1ML2wMy heart jus broke into pieces
— thaman S (@MusicThaman) April 25, 2021
A new dream started in me to build a old age home 🏡 will make it soon I wish god gives me the strength and support to make it ...
I was typing this with tears rolling
Don’t waste food
Serve food for the needy
🥺
Let’s be HUMANS ✊♥️ https://t.co/gxHSF1ML2w
ఇదీ చూడండి : ఆ సినిమాలో పవన్‌తో పాట పాడిస్తున్నా: తమన్