ETV Bharat / sitara

ఆ దర్శకుడు అలా అనేసరికి షాకయ్యా: సునీత - Singer Sunitha songs

గతంలో ఓ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నప్పుడు, ఆ సినిమా దర్శకుడు చేసిన పనిగురించి గాయని సునీత వెల్లడించారు. ఆ విషయంలో తాను షాకయ్యానని అన్నారు. అతడు ఎవరనేది మాత్రం సునీత చెప్పలేదు.

Singer Sunitha
సునీత
author img

By

Published : May 5, 2021, 5:24 PM IST

ఓ సినిమాకు డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో దర్శకుడు చేసిన పనితో తాను షాకయ్యానని ప్రముఖ గాయని సునీత చెప్పారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సునీత.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, తన కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి అంటే తనకెంతో అభిమానమని.. ఆయన ఆధ్వర్యంలో 40 చిత్రాల్లో పాటలు పాడానని అన్నారు.

Singer Sunitha
గాయని సునీత

'ఏదైనా చిత్రానికి డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో మీరు ఎదుర్కొన్న, ఎప్పటికీ మర్చిపోలేని ఓ సరదా సంఘటనను తెలియచేయగలరు?' అని సునీతను ప్రశ్నించగా... "సరదా సంగతులంటే ఏమీ జరగలేదు కానీ గతంలో ఓ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పడం కోసం స్టూడియోకు వెళ్లాను. స్టూడియో లోపలకు వెళ్లగానే ఆ చిత్ర దర్శకుడు.. 'సునీత మేడమ్ నేను మీకు పెద్ద అభిమానిని. నా సినిమాకు మీరు డబ్బింగ్ చెప్పడం నాకెంతో ఆనందంగా ఉంది' అని అన్నాడు. కొన్ని సీన్లు డబ్బింగ్‌ చెప్పిన అనంతరం ఆయన నన్ను 'సునీత గారు' అని పిలవడం ప్రారంభించారు. నేను పెద్దగా పట్టించుకోలేదు. మరికొద్దిసేపటి తర్వాత 'సునీత' అని పిలిచారు. అలా కొంత డబ్బింగ్‌ పూర్తయ్యే సరికి ఆయన నన్ను .. 'అరేయ్‌, అమ్మా, బుజ్జి, కన్నా" అనేసరికి షాక్‌ అయ్యాను. ఈయనేంటి మేడమ్‌ దగ్గర మొదలుపెట్టి కన్నా, బుజ్జి అంటున్నాడు? ఇప్పుడు నేను ఎలా స్పందించాలి? అనుకున్నాను. అదృష్టం కొద్ది ఆ తర్వాత మళ్లీ ఆయన్ను కలవలేదు' అని సునీత అప్పటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.