బాలీవుడ్ ప్రముఖ గాయని సునిధి చౌహాన్.. 'భూత్', 'బాస్ ఏక్ పల్', 'హవా హవాయి', 'రంగూన్'లాంటి సినిమాల్లో పాటలు పాడి, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది వచ్చిన వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'సైరా'లో టైటిల్ ట్రాక్ పాడింది. తాజాగా ఆమె వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చినట్లు సమాచారం. ప్రముఖ స్వరకర్త హితేష్ సోనిక్తో ఎనిమిది సంవత్సరాలుగా కాపురం చేస్తున్న ఈమె.. ప్రస్తుతం వేరుగా ఉంటోందట. వీరికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు.
అయితే దీని గురించి ఏ ఒక్కరూ.. తమ స్నేహితులకు, సన్నిహితులకు కాని ఈ విషయం చెప్పలేదు. సునిధికి రెండో భర్త హితేష్. వీరికి 2012లో వివాహమైంది. గతంలో తన 18వ ఏటా, ఇంట్లోనుంచి పారిపోయి ప్రముఖ కొరియాగ్రాఫర్ బాబి ఖాన్‌ను 2002లోనే రహస్యంగా పెళ్లి చేసుకొంది. అయితే ఒక్క ఏడాదికే మనస్పర్థలు వచ్చి విడిపోయారు.
ఇదీ చూడండి : రియల్మ్యాన్ దర్శకుడు సుకుమార్.. ఐదుగురికి ఛాలెంజ్