ETV Bharat / sitara

తేనెల పాటల 'కోకిల'.. ఈ గాన సుశీల

author img

By

Published : Nov 13, 2020, 5:34 AM IST

సినీ సంగీతంపై వాలిన ఆ కోకిల హాయిహాయిగా, మధురాతిమధురంగా ఆలపిస్తుంటే కొన్ని తరాలు మైమరిచి ఆలకించాయి. వేలవేల పాటలు ఆమె మంత్రగళంలో జీవం పోసుకుని.. పరిమళం అద్దుకున్నాయి. కొత్త అందచందాలతో శ్రోతల వీనుల విందు చేశాయి. హృదయాలను రసభరితం చేశాయి. ఆమే దక్షిణాది లతామంగేష్కర్‌గా పి.సుశీల పేరొందారు. నేడు (నవంబరు 13) పి.సుశీల పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని గాన లహరులనూ, స్వర మధురిమలనూ నెమరువేసుకుందాం.

Singer P.Susheela Birthday Special Story
తేనెల సోనల పాటల కోకిల.. ఈ గాన సుశీల

సుశీల పాటలను స్మరించటమంటే కొన్ని దశాబ్దాల తెలుగు చలనచిత్రాల గమనాన్ని కూడా గుర్తు చేసుకున్నట్టే! ఆమె సినీరంగ ప్రవేశం చేసిన 1952 నాటికే బాలసరస్వతీదేవి. జిక్కి, పి.లీల, ఎం.ఎల్‌. వసంతకుమారి లాంటి ప్రతిభావంతులన గాయనులుండేవారు. వారి మధ్య తన ఉనికిని చాటుకోవటం అంత సులువైన పని కాదు. ఆమె మొదటి పాట 'కన్నతల్లి' చిత్రంలోది. పెండ్యాల సంగీత దర్శకత్వంలో ఎందుకు పిలిచావెందుకు అన్న ఆ పాటను ఎ.ఎం రాజాతో కలిసి పాడారు.

Singer P.Susheela Birthday Special Story
పి.సుశీల

1956 సంవత్సరం సుశీల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది. అంతవరకు చిన్నచిన్న పాత్రలకు తన కంఠాన్నిస్తూ వచ్చిన సుశీల మొదటిసారిగా కథానాయిక పాత్రకు 'మా తోడికోడళ్ళు' చిత్రంలో పాడింది. తెలుగు, తమిళ బాషల్లో నిర్మించిన ఆ చిత్రానికి నాయిక (సావిత్రి) పాటలన్నీ రెండు బాషల్లోనూ సుశీలే పాడింది. రెండు బాషల్లోనూ ఆ చిత్రం ఘన విజయం సాధించింది. సుశీల ప్రాచుర్యం కూడా ఎంతోగానో ఇనుమడించింది’’ అన్నారాయన.

అందుకే తెలుగులో 1955 నుంచీ చాలాకాలం వరకూ సుశీల పాటలేని చిత్రం దాదాపు లేకపోయింది. 1960 - 1970ల మధ్య తొలి భాగం వరకూ ఆమె కెరియర్‌లోనే అత్యుత్తమమని సంగీతభిమానులు భావిస్తారు. "1980 తర్వాత సినిమాలో వేగం పెరిగింది. 'గుగ్గుగ్గుగ్గు గుడిసుంది' లాంటి పాటలు పాడనన్నా నాచేత పాడించారు. అవి మరోతరం ప్రేక్షకులకు నన్ను దగ్గర చేశాయి" అంటారు సుశీల. తెలుగు సినీసంగీత స్వర్ణయుగ చరిత్రంలో ఆమెది ఘనతర ఆధ్యాయం!

పి.సుశీలతో జేసుదాసు

12 భాషల్లో....

ఆరు దశాబ్దాల్లో 12 భాషల్లో (తెలుగు, తమిళం కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళ్లు పడుగు, సింహళీస్, మరాఠీ) దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడారు. విజయనగం మాహారాజా కళాశాలలో ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద అభ్యసించిన శాస్త్రియ సంగీతం దీనికి పునాదిగా పనిచేసింది.

పి.సుశీల దంపతులు

సహజత్వం, వైవిధ్యం....

సుశీల గానం ప్రత్యేకతలు ఏమిటి? పాటలోని ప్రతి పదం చక్కగా వినపడేంత స్పష్టత. సన్పివేశానుగుణంగా భావయుక్తంగా సహజంగా తీయగా పాడటం. ఏ హీరోయిన్‌కు పాడితే అచ్చం ఆమె గొంతే అనిపించే గానం మరో విశిష్టత. ఆమె గొంతు నుంచి జాలు వారిన ఆ స్వర మాధురిమలలో కొన్ని మీకోసం.

  • ఇది మల్లెల వేళయనీ... ఇది వెన్నెల మాసమనీ (సుఖదుఃఖాలు)
  • వస్తాడు నా రాజు ఈ రోజు (అల్లూరి సీతారామరాజు)
  • సన్నగ వీచే చల్లగాలికీ (గుండమ్మ కథ)
  • బృందావనమది అందరిదీ (మిస్సమ్మ)
  • హిమగిరి సొగసులూ (పాండవ వనవాసం)
  • నీ పేరు తలచినా చాలు (ఏకవీర)
  • తెలిసందిలే... తెలిసిందిలే (రాముడు మల్లిగాడు)
  • మల్లెపందిరి నీడలోన జాబిల్లీ (మాయదారి మల్లిగాడు)
  • మనసే కోవెలగా మమతలు మల్లెలుగా (మాతృదేవత)
  • మనసు పరిమశించెనే (శ్రీకృష్ణార్జున యుద్ధం)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.