ETV Bharat / sitara

'అవన్నీ పుకార్లే.. ఆ ఆఫర్​ నాకు రాలేదు' - 'చంద్రముఖి 2'పై స్పష్టతనిచ్చిన సిమ్రాన్​

'చంద్రముఖి 2' చిత్రంలో అవకాశం వచ్చినట్లు వస్తోన్న వార్తలపై స్పందించారు నటి సిమ్రాన్​. ఈ ప్రాజెక్టులో తాను భాగస్వామ్యం కాలేదని.. అవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు.

simran
సిమ్రాన్​
author img

By

Published : Jun 3, 2020, 1:47 PM IST

రజనీకాంత్‌, జ్యోతిక కీలకపాత్రల్లో నటించిన చిత్రం 'చంద్రముఖి'. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. అయితే త్వరలోనే 'చంద్రముఖి 2' తెరకెక్కించే పనిలో బిజీగా చిత్రబృందం. రాఘవ లారెన్స్​ ఇందులో నటిస్తున్నాడు. ఈ స్వీక్వెల్​లో నటి సిమ్రాన్‌ నటించనుందనే వార్తలు ఇటీవలె జోరందుకున్నాయి. తాజాగా వాటిపై స్పందించిందీ అందాల భామ. అవన్నీ పుకార్లని స్పష్టం చేసింది. పూర్తి స్పష్టత లేకుండా ఇటువంటి వార్తలను ప్రచురించవద్దని తెలిపింది.

1997లో విడుదలైన 'వి.ఐ.పి' అనే తమిళ చిత్రంతో కథానాయికగా వెండితెరపై మెరిసింది సిమ్రాన్​. మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్‌ అవార్డును పొందింది. అదే ఏడాది తెలుగులో విడుదలైన 'అబ్బాయి గారి పెళ్లి'లో నటించి టాలీవుడ్​లో అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్‌ వంటి అగ్రకథానాయకులతో పాటు మహేశ్‌బాబుతో కూడా ఆమె ఆడిపాడింది. 'నరసింహనాయుడు', 'సమరసింహారెడ్డి', 'కలిసుందాం..రా!', 'యువరాజు', 'మృగరాజు', 'డాడీ', 'సీతయ్య' చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.

ఇదీ చూడండి : ఆయన చెప్పాడని పెళ్లి చేసుకున్నా: అమితాబ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.