ETV Bharat / sitara

మూడేళ్ల తర్వాత హీరో శింబు ఎంట్రీ

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత సామాజిక మాధ్యమాల్లోకి వచ్చారు తమిళ హీరో శింబు. నెగిటివిటీ ఎక్కువైన కారణంగానే ఇన్నాళ్లు దానికి దూరంగా ఉన్నట్లు వెల్లడించారు.

Simbu makes grand re-entry on social media
మూడేళ్ల తర్వాత హీరో శింబు ఎంట్రీ
author img

By

Published : Oct 23, 2020, 3:21 PM IST

కోలీవుడ్‌ కథానాయకుడు శింబు.. దాదాపు మూడేళ్ల తర్వాత సోషల్‌మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చారు. నెట్టింట్లో వ్యతిరేకత ఎక్కువ ఉందని అభిప్రాయపడిన ఆయన.. 2017లో ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలను డియాక్టివేట్‌ చేశారు. తన సినిమాలకు సంబంధించిన పలు అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేసేవారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలను యాక్టివేట్‌ చేయమని పలువురు అభిమానులు నుంచి శింబుకు విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఆ ఖాతాలను ఆయన యాక్టివేట్‌ చేశారు.

ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో వివిధ వర్కౌట్లు, కర్రసాము, క్లాసిక్‌ డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. చాలా కాలం తర్వాత తమ అభిమాన నటుడు సోషల్‌మీడియా ద్వారా అందుబాటులోకి రావడం వల్ల ఫ్యాన్స్‌ ఎంతో సంతోషిస్తున్నారు. అయితే శింబు ట్విటర్‌ అకౌంట్‌కు ఇంకా అధికారిక గుర్తింపు రాలేదు.

వైదొలగడానికి కారణమిదే..

2017 గణతంత్ర దినోత్సవం రోజున సోషల్‌మీడియాకి గుడ్‌బై చెబుతున్నట్లు శింబు ప్రకటించారు. 'సోషల్‌మీడియాలో పాజిటివిటీ కంటే నెగెటివిటీ ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రతిదానిలో నెగెటివిటీనే కనిపిస్తుంది. అందువల్ల ఇందులో కొనసాగడానికి నేను భయపడుతున్నాను' అని ఆయన వెల్లడించారు. అనంతరం తన ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలను డియాక్టివేట్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.