ETV Bharat / sitara

స్టార్​ హీరో కారు ఢీకొని వికలాంగుడు మృతి.. ఒకరు అరెస్టు!

Simbu Car Accident: తమిళ హీరో శింబు కారు ఢీకొని ఓ దివ్యాంగుడు చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి శింబు డ్రైవర్​ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

author img

By

Published : Mar 24, 2022, 2:02 PM IST

Updated : Mar 24, 2022, 4:05 PM IST

simbu car accident
simbu accident

Simbu Car Accident: తమిళ హీరో శింబు కారు ఢీకొని ఓ వికలాంగ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ప్రమాదం చెన్నైలో మార్చి 18న జరగగా, అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్​లో వైరల్​గా మారింది. ఘటన జరిగిన సమయంలో శింబు తండ్రి, ప్రముఖ ఫిల్మ్​మేకర్ టి.రాజేంద్రన్​ కారులోనే ఉన్నారు. వృద్ధుడు రోడ్డు దాటుతుండగా, కారు అతడి మీద నుంచి దూసుకెళ్లింది. అయితే రాజేంద్రన్​ కారులోంచి.. అంబులెన్స్​కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి వరకు అతడికి తోడుగా తన డ్రైవర్​ సెల్వంను పంపారని సమాచారం.

"దర్యాప్తులో తన మనవరాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రాజేంద్రన్​​ చెప్పారు. శింబు మినహా కుటుంబసభ్యులు అందరూ కారులోనే ఉన్నట్లు వివరించారు. వృద్ధుడికి రూ.30 వేలు పరిహారం ఇస్తామని అన్నారు." అని రాజేంద్రన్​ తమతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే వృద్ధుడు మరణించిన తర్వాత రాజేంద్రన్ ఫోన్​ లిఫ్ట్​ చేయడం మానేశారని వెల్లడించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కారును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: లివ్​ ఇన్ రిలేషన్​లో నిధి అగర్వాల్.. త్వరలో ఆ హీరోతో పెళ్లి?

Last Updated : Mar 24, 2022, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.