తెలుగులో లవర్‌బాయ్‌గా అలరించిన నటుడు సిద్ధార్థ్(Actor Siddharth. ఆయన చనిపోయాడంటూ ఓ యూట్యూబ్ ఛానల్ వీడియోను ఉంచింది. ఈ విషయంపై సిద్ధార్థ్ ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందట. అసలు విషయం ఏంటంటే.. ‘చిన్న వయసులోనే మరణించిన 10 మంది దక్షిణాది తారలు’ పేరుతో ఎవరో ఓ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. సంబంధిత వీడియో థంబ్‌నైల్‌లో సౌందర్య, ఆర్తి అగర్వాల్ ఫొటోలతో పాటు సిద్దార్థ్‌ది ఉంది. దీన్ని చూసిన ఓ వ్యక్తి ట్విటర్ వేదికగా ఈ ఫొటోను షేర్ చేస్తూ సిద్దార్థ్‌ని ట్యాగ్ చేశాడు. 'వ్యూస్ (వీక్షణలు) కోసం ఏమైనా చేస్తారా? ఈ థంబ్‌నైల్ ఏంటి?' అంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై స్పందించాడు సిద్దార్థ్ .
"ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. నేను చనిపోయానంటూ ఇలా వీడియోలు పెడుతున్నారని యూట్యూబ్‌కు ఫిర్యాదు చేశాను. వాళ్లేమో "క్షమించండి.. ఈ వీడియోతో ఎలాంటి సమస్య లేదు" అని సమాధానం ఇచ్చారు అంటూ ఓ ఫన్నీ ఎమోజీని జోడించాడు. అయితే ఈ వీడియోలో సిద్దార్థ్ గురించి ఏం చెప్పలేదు. కేవలం వీక్షణల కోసం తన ఫొటోను వాడారు. దీన్ని చూసిన నెటిజన్లు, సిద్ధార్థ్ అభిమానులు కామెంట్ల రూపంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
'మహాసముద్రం'తో దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నాడు సిద్దార్థ్. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. శర్వానంద్ మరో కథానాయకుడు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: హీరో సిద్ధార్థ్‌ను చంపేస్తామని బెదిరింపులు