ETV Bharat / sitara

'ఎనిమిదేళ్ల తర్వాత 8న షూటింగ్​ సెట్లోకి..' - శర్వానంద్​తో సిద్దార్థ్

ఎనిమిదేళ్ల తర్వాత సిద్ధార్థ్ తెలుగు సినిమాతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. 'మహాసముద్రం' పేరుతో వస్తోన్న ఈ సినిమాలో శర్వాతో కలిసి నటిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా షూటింగ్​లో పాల్గొనడం ఆనందంగా ఉందని ట్విట్టర్​లో పేర్కొన్నాడు సిద్ధార్థ్.

sidharth
ఎనిమిదేళ్ల తర్వాత 'మహాసముద్రం'తో సిద్దార్థ్
author img

By

Published : Dec 8, 2020, 9:08 PM IST

'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించి యువతలో మంచి క్రేజ్‌ ఏర్పరచుకున్నాడు సిద్ధార్థ్‌. అప్పుడప్పుడు తమిళ డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తున్న సిద్ధూ టాలీవుడ్‌కి దూరమై 8 సంవత్సరాలైంది. ప్రస్తుతం 'మహాసముద్రం' సినిమాతో పూర్వవైభవాన్ని అందుకునేందుకు సిద్ధమయ్యాడు. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కాంబినేషన్‌లో 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేం అజయ్‌ భూపతి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అసాధారణమైన పాత్రలతో భావోద్వేగభరిత కథగా రూపొందుతుంది.

ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబరు 7 నుంచి మొదలైంది. ఈ సందర్భంగా డిసెంబర్​ 8న చిత్రీకరణలో పాల్గొన్నాడు సిద్ధూ.

దర్శకనిర్మాతలు సామాజిక మాధ్యమాల వేదికగా సిద్ధార్థ్‌కి స్వాగతం పలికారు.

ట్విటర్‌ వేదికగా వాళ్లకి ధన్యవాదాలు తెలియజేస్తూ '8 సంవత్సరాల తర్వాత డిసెంబరు 8న తెలుగు సినిమా సెట్‌లో అడుగుపెడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది' అని తెలిపాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ నాయికలు. చైతన్య భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చదవండి:నిహారిక వెడ్డింగ్​: మెగా ఫ్యామిలీ సందడే సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.